ఖుద్వాన్పూర్ గ్రామంలో పర్యటించిన వినయ్ రెడ్డి. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ – మీ పొన్నాల) జనవరి18: నందిపేట్ మండలం ఖుద్వాన్పూర్ గ్రామంలో కోదండపురం శ్రీలక్ష్మి ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం కి 8 లక్షల ఎస్డీఎఫ్ నిదులను కాంపౌండ్ వాల్ నిర్మాణాననికి మంజూరు చేయాలని విన్నపించగా దీనికి గాను వినయ్ కుమార్ రెడ్డి ఎస్డీఎఫ్ నిధుల ద్వారా మంజూరు చేస్తా నాని హామీ ఇవ్వడం జరిగింది. దేవస్థానమునకు విచ్చేసిన వినయ్ కుమార్ రెడ్డి గారికి గ్రామ కమిటీ మరియు ఆలయ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో నందిపేట్,ఆలూర్, డొంకేశ్వర్, మాక్లూర్ మండల అద్యక్షులు మంద మహిపాల్, విజయ్,భూమేష్ రెడ్డి,రవి, డొంకేశ్వర్ మరియు మాక్లూర్ PACS పిఎసిఎస్ చైర్మెన్ లు భారత్ రెడ్డి,అశోక్ వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు సిలిండర్ లింగం,దేగం గంగారెడ్డి, పిప్పేరా సాయి రెడ్డి,నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు బైండ్ల ప్రశాంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.

