అగాపే వర్షిప్ సెంటర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ – మీ పొన్నాల) డిసెంబర్25: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లోని అగాపే వర్షిప్ సెంటర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదిన సందర్భంగా చర్చి సభ్యులు గీతాలను ఆలపించారు. నృత్యాలు చేస్తూ, తమ సంతోషాన్ని కేకులు తినిపించుకుంటూ పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ రమేష్ జాన్ మాట్లాడుతూ… పాపం వలన దేవునికి దూరమైన మనిషికి దేవుడుతో సంబంధాన్ని ఏర్పాటు చేయుటకు, ఆత్మ రూపీ అయిన దేవుడు క్రీస్తు అనే దైవమానుడిగా అవతరించాడన్నారు. క్రీస్తు జననం మానవాళికి సంతోషం సమాధానాలను కలిగించిందని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ మండల పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్ వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజయ్, శశి, ఉదయ్, నిస్సి, అభిషేక్ రాఫా, ప్రభు, రమేష్ ,ఇసాకు, నాగబాబు లతోపాటు విశ్వాసులు నాయకులు పాల్గొన్నారు.

