అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్టు టూర్ ఆఫరేషన్ (ఏబీటీఓ) అంతర్జాతీయ అధ్యక్షులుగా మల్లేపల్లి లక్ష్మయ్య ఏకగ్రీవం.
అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్టు టూర్ ఆఫరేషన్ (ఏబీటీఓ) అంతర్జాతీయ అధ్యక్షులుగా మల్లేపల్లి లక్ష్మయ్య ఏకగ్రీవం. హైదరబాద్(తెలంగాణ ఫోకస్ – మీ పొన్నాల): అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్టు టూర్ ఆఫరేషన్ (ఏబీటీఓ) అంతర్జాతీయ అధ్యక్షులుగా మల్లేపల్లి లక్ష్మయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేసారు. ఈనెల10న బీహార్ లోని వైశాలిలో జరిగిన ఏబీటీఓ వార్షికోత్సవ సభలో మల్లేపల్లి లక్ష్మయ్యను కమిటీ ఏకగ్రీవంగా ప్రకటించింది. తెలంగాణ బుద్ధవనం ప్రాజెక్ట్ కు ప్రత్యేక అధికారి(ఓఎస్డి)గా పని చేశారు. అలాగే ఇప్పటికే ఇంటర్నేషనల్ దళిత జర్నలిస్టు నెట్ వర్క్ (ఐడీజేఎన్) వ్యవస్థాపక అధ్యక్షులుగా పని చేస్తున్నారు. వివిధ దేశాలలో దళిత జర్నలిస్టు నెట్ వర్క్ ను బలోపేతం చేయడం కోసం కృషి చేస్తున్నారు. దేశంలోని దళిత సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతున్నారు. మరోవైపు బుద్దయిజం ప్రచారం చేస్తూ ప్రత్యేక రచనలు చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ బుద్దవనం ప్రాజెక్ట్ ను ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం టూరిజం లో కీలక పాత్ర పోషిస్తుంది.