Telugu Updates

మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి.

Post top

మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి.                        ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ – మీ పొన్నాల) డిసెంబర్6: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్​ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. ఆర్మూర్ పట్టణంలో గల అంబేద్కర్​ గారి విగ్రహానికి పులమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ సమానత్వం, సామాజిక న్యాయం, సామరస్యం కోసం ఆయన అనుసరించిన సిద్ధాంతాలు మనందరికీ మార్గదర్శకాలుగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి అన్నారు. ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని జర్నలిస్టు కాలనీ లో గల అంబేద్కర్ స్థల భవనాన్ని పరిశీలించారు. త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఖంశీ విగ్రహంతో చేయిస్తామని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి మానవ మనుగడ కొనసాగాలంటే దేశంలో చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే అభివృద్ధి అక్షరాస్యత సమానత్వ పెరుగుతుందని పొందపరచిన రాజ్యాంగం ఆధారంగానే శ్రీమతి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని అందరినీ సమానత్వంగా చూస్తూ ప్రభుత్వాల నుండి రావలసిన ఫలాలను కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమైతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ కొక్కెర భూమన్న, ప్రతినిధులు మాదిగ మహాసేన  నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి, దళిత సంఘాల నాయకులు గుమ్మడి చంద్రయ్య తదితర దళిత నాయకులు ,స్థానిక పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్, వైస్ చైర్మన్ మున్ను, మాజీ వైస్ చైర్మన్ లింగా గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా, పట్టణ కాంగ్రెస్ నాయకులతోపాటు దళిత ముద్దుబిడ్డ రింగుల భూషణ్ (కౌన్సిలర్) ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.