పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశానుసారంగా ఫతేపూర్ రైతుల ఆధ్వర్యంలో ప్రజాపాలనలో పాలాభిషేకం. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ – జింధం నరహరి) డిసెంబర్4: ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశానుసారంగా ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్ గ్రామంలో రైతుల పండుగ సంబరాల్లో భాగంగా నాలుగు విడతలో రుణమాఫీ చేసినందుకు సన్న వడ్లకు 500/- బోనస్ ఇచ్చినందుకు మా గ్రామ రైతుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖా మాత్యులు భట్టి విక్రమార్క,ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి లకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా బత్తుల ప్రవీణ్ ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి అని రైతులకు సకాలంలో రుణమాఫీ చేసి,500 బోనస్ ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో రేవంత్ రెడ్డి ప్రజా పాలన అజరామరంగా నిలిచిపోతుందన్నారు. గత పది సంవత్సరాలుగా ఆలసి సొలసిపోయిన అన్ని వర్గాల ప్రజలకు ఊరట కలిగిందని, ఒకే ఒక్క సంవత్సరంలో కనివిని ఎరుగని రీతిలో చరిత్ర సృష్టించారని,ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుల వరకు మనమందరం ఐక్యంగా ఉండి గ్రామాలలో రాబోయే సర్పంచ్,ఎంపీటీసీ,ఎంపీపీ, జడ్పీటీసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘనవిజయం చేకూరేలా ఐక్యతతో సహకరించాలని పేరుపేరునా అభ్యర్థించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు తలారి పోచన్న, డైరెక్టర్ సాయన్న,సంజీవ్,మట్ట అజయ్,భూమన్న, సిహెచ్ గంగారాం, బాల నర్సయ్య, మాజీ సర్పంచ్ బద్దం వెంకటరాజు, మట్ట సంతు, గడ్డం గంగన్న, హరి ప్రసాద్, గ్రామ శాఖ అధ్యక్షుడు సునీల్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బత్తుల ప్రవీణ్ కుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.