అవినీతి అధికారుల బాగోతం త్వరలో బట్టబయలు.. ~గడచిన అసెంబ్లీ,ఎంపీ ఎన్నికల సమయంలో స్వాహా పర్వం. ~ఫేక్ బిల్లులు సృష్టించి జేబులు నింపుకున్నారని ఆరోపణలు. ~ఉన్నతాధికారులు విచారిస్తేనే నిజాలు తెలిసే ఛాన్స్..

అవినీతి అధికారుల బాగోతం త్వరలో బట్టబయలు.. ~ గడచిన అసెంబ్లీ,ఎంపీ ఎన్నికల సమయంలో స్వాహా పర్వం. ~ ఫేక్ బిల్లులు సృష్టించి జేబులు నిండుకున్నారని ఆరోపణలు.. ~ ఉన్నతాధికారులు విచారిస్తేనే నిజాలు తెలిసే ఛాన్స్.. నిజామాబాద్(తెలంగాణ ఫోకస్ – మీ పొన్నాల) అక్టోబర్31: గడిచిన అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలు గాని, ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణకు ప్రతి నియోజకవర్గానికి నిధులు కేటాయించింది. జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను, డిప్యూటీ తహసీల్దార్లని డిడిఓ గా నియమించారు. వారి పేరిట అకౌంట్ ను ఓపెన్ చేయించి నిధులను ట్రాన్స్ఫర్ చేయించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక కోటి 60 లక్షల రూపాయలు కేటాయించారు. ఈ నిధులతో ఎన్నికల సిబ్బందికి భోజనాలు నుండి మొదలుకొని అన్ని వ్యవహారాలు నిర్వహించాల్సి ఉంటుంది. పోల్ చిట్టీలు, ఓటర్ లిస్టు జాబితా, ఫ్లెక్సీలు, కరపత్రాలు, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూమ్స్, విద్యుత్ సౌకర్యం, ఫోటో, వీడియో గ్రాఫర్లు, చెకింగ్ స్క్వాడ్స్ కు సంబంధించిన వాహనాలు, అధికారులకు వసతులు చేకూరాడానికి కావలసిన AC లు ప్రింటింగ్ చేయుటకు జిరాక్స్ మిషన్ లు ఇతర ఇతర వస్తువుల కొనుగోలు ఇలా అన్నింటిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. సహజంగా మండల స్థాయి అధికారులుగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు. అయితే వీరు నిధుల అకౌంటు నిర్వహణకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు డిడిఓ ఆథరైజేషన్ ను DT ల స్థాయిలో తమ దిగువ క్యాడర్లో ఉన్న అధికారులకు ఇచ్చారు.ఈ వ్యవహారాన్ని గమనించిన ఓ మండల స్థాయి అధికారి ఎన్నికల నిధులు పక్కదారి పట్టించేందుకు పథకం రూపొందించాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. అట్టి నిధుల నుండి కొంత బాగానే నిధులని అక్రమముగా ఫేక్ బిల్లు పెట్టీ పై అధికారులని తప్పు దోవ పట్టీంచి నిధులని స్వాహా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనిపై పై అధికారుల అజమాయిషీ లేకనే ఇలా కింద స్థాయి ఉద్యోగస్తులు నిధులని పక్క దారి పట్టీస్తున్నారా? లేక ఇతర మండల స్థాయి లేదా డివిజన్ స్థాయి అధికారులు కూడా కుమ్మకై ఉన్నారా?అనే విషయాలలో క్లుప్తమైన విచారణ జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపడితేనే అసలు విషయాలు తెలుస్తాయి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమాల తతంగం పై ఉన్నత స్థాయి అధికారులు విచారణ చేపడతారా,లేదా! అనేది వేచి చూడాలి. తరువాయి భాగం మరో శీర్షికలో ప్రచురణ…