యూనివర్సిటీకి ఐలమ్మ పేరును ఖరారు చేసిన సిఎం కు ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం తరుపున జైభీం. ఆర్మూర్ డివిజన్(తెలంగాణ ఫోకస్ -పొన్నాల చంద్రశేఖర్) సెప్టెంబర్11: చాకలి ఐలమ్మ 39వ వార్షికోత్సవ సభలో కోఠిలోని మహిళ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని డాక్టర్ కంచ ఐలయ్య షెపర్డ్ సూచన మేరకు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినందుకు ఆలిండియా అంబేడ్కర్ యువజన సంఘం (ఏఐఏయుఎస్) ఖుషి వ్యక్తపర్చారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తికి నిదర్శనమైన తెగువకు స్థానమివ్వడం సరైన నిర్ణయమని ఏఐఏయుఎస్ జాతీయ కోఆర్డినేటర్ ఎస్.వరుణ్ కుమార్ సీఎంను అభినందించారు. ఈ మేరకు ముంబై నుంచి హైదరాబాద్ కు ప్రత్యేకంగా విచ్చేసిన ఏఐఏయుఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మూల్ నివాసి మాలజీ మాట్లాడుతూ వీరనారి ఐలమ్మను “తెలంగాణ తల్లీ” గా ప్రకటించాలని కోరారు. జనగామ జిల్లాకు ఐలమ్మ పేరు పెట్టాలని ఏఐఏయుఎస్ రాష్ట్ర అధ్యక్షులు కాడారం వినయకుమార్ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని “సమాంతర వాయిస్” కార్యాలయంలో జరిగిన అత్యావశక సమావేశంలో ఏఐఏయుఎస్ జాతీయ రాష్ట్ర నాయకుల తోపాటు నిజమాబాద్ జిల్లా నేత జర్నలిస్ట్ అంగుళి మాలజీ, హైదరాబాద్ సిటీ నాయకురాలు డి.మంజుల మాదిగ తదితర్లు పాల్గొన్నారు.