ఆర్మూర్ గైనకాలజిస్ట్‌కు లాపరోస్కోపిక్ సర్జరీ ఫెలోషిప్(FMAS)లో అవార్డు అందుకున్న డాక్టర్ వసంత కుమారి.

ఆర్మూర్ గైనకాలజిస్ట్‌కు లాపరోస్కోపిక్ సర్జరీ ఫెలోషిప్(FMAS)లో అవార్డు అందుకున్న డాక్టర్ వసంత కుమారి. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)సెప్టెంబర్3: నిజామాబాద్ జిల్లాలోని గత ఇరవై సంవత్సరాలకు పైగా ఆర్మూర్ ప్రాంతంలో వైద్య సేవలందిస్తున్న వసంతజ్యోతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ వసంతకుమారి, లాప్రోస్కోపిక్ సర్జరీ (FMAS) లో ఫెలోషిప్ పొందారు. శిల్ప కళావేదిక హైదరాబాద్‌లో ఇటీవల ముగిసిన AMASI (Association of Minimal Access Surgeons of India ) యొక్క 19వ అంతర్జాతీయ సదస్సులో ఆమె ఈ అవార్డును అందుకుంది. AMASI వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు భారతదేశంలో లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స యొక్క లెజెండ్ డా.పళనివేలు, కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కరుణాకరరెడ్డి & నేషనల్ AMASI (అసోసియేషన్ ఆఫ్ మినిమల్ యాక్సెస్ సర్జన్స్ ఆఫ్ ఇండియా) యొక్క ఆఫీస్ బేరర్లు ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎం.జె హాస్పిటల్ కు చెందిన ప్రముఖులు డాక్టర్ మధుశేఖర్ చేయూత స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు మరియు పలువురు చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ సభ్యులు ఆర్మూర్ వైద్యులు డాక్టర్ వసంతకుమారిని అభినందించారు.