డాక్టరేట్ పట్టాను అందుకున్న ఆర్మూర్ మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)ఆగస్టు24: ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పండిత వినీత పవన్ డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో గల పెర్కిట్, మామిడిపల్లి విలీనమైన గ్రామాలకు తోలి మహిళ మున్సిపల్ చైర్మన్ గా నిలిచి..ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో గల విజ్ఞాన్ యూనివర్సిటీ నందు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినా సుప్రీం కోర్టు న్యాయమూర్తి పొమిడి గంటమ్ శ్రీ నరసింహామ్ గారిచే డాక్టరెట్ పట్టను స్వీకరించారు. పండిత్ వినీత పవన్ గతంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా విధులను నిర్వహించారు ప్రొఫెసర్ గా ఉన్న సమయంలో విద్యపై ఉన్న మక్కువతో పి.హెచ్.డి (P.hd) చెయలని పట్టుదలతో గుంటూరు లోనీ విజ్ఞాన్ యూనివర్సిటీ నందు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది.ఆదేవిదంగా 2020 లో జరిగిన మున్సిపల్ ఎన్నికలో పోటీచేసీ తోలి ప్రయత్నంలోనె ఆర్మూర్ పురపాలక గ్రేడ్ -2 తోలి మున్సిపల్ ఛైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ గారు ఎన్నికైనారు. ఎన్నికైనా కొన్ని నెలల్లోనే పండిత్ వినీత్ గారికి ఆరోగ్యం సహకరించ పోయినప్పటికీ తాను ఎంతో మనోధైర్యంతో ప్రజల ఆశీర్వాదంతో వ్యాధిని జయించారు. ఎల్లవేళలా ప్రజలతో ఉంటూ ఆర్మూర్ పట్టణ అభివృద్ధికి పాటుపడ్డారు. పండిత్ వినీత్ పవన్ మనోధైర్యంతో ముందుకు సాగాలని ఆర్మూరు ప్రజలు కోరుకుంటున్నారు.
Good news