క్షత్రియ స్కూల్ చేపూర్-ఆర్మూర్ లో ఘనంగా బోన మెత్తిన క్షత్రియ విద్యార్థులు.. ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్ టీవీ) జులై27: క్షత్రియ పాఠశాల చేపూర్ నందు ఆషాఢ మాస బోనాల పండుగను అద్భుతంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కోశాధికారి శ్రీ అల్జాపూర్ గంగాధర్, సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్ జ్యోతిప్రజ్వలన గావించి ప్రారంభించినారు.ఈ సందర్భంగా కోశాధికారి అల్జాపూర్ గంగాధర్ మాట్లాడుతూ.. చదువు తో పాటు సంస్కారాన్ని అందించే పాఠశాల క్షత్రియ పాఠశాల అని అన్నారు. ఆషాఢ మాసంలో నిర్వహించుకునే ఈ బోనాల పండగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిదర్శనమని అన్నారు. శ్రీ అల్జాపూర్ దేవేందర్ గారు మాట్లాడుతూ.. పండుగ నిర్వహణను ప్రకృతి తో ముడిపెట్టి పండుగ విశిష్టతను చెప్పినారు. వ్యాధులు ప్రబలకుండా అమ్మ వారికి బోనం సమర్పించి ప్రజలను సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంచాలని ఆకాంక్షించినారు. ఈ సందర్భంగా ఎ.పి.జె అబ్దుల్ కలాం మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గార్ల ఆదర్శవంతమైన జీవితాన్ని వారి దేశభక్తి గురించి తెలియజేస్తూ, సామాన్య పేదరిక కుటుంబంలో జన్మించి, ప్రత్యేక శ్రద్ధతో విద్య నభ్యసించి, దేశం కోసం వారు చేసిన కృషిని ఉదహరించినారు. స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గారు మాట్లాడుతూ బోనాల పండుగ అలాగే బతుకమ్మ పండుగ తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రత్యేక నిదర్శనం అని,సమాజ బాగు కోసం ఉపయోగపడే దైవ సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించడంలో క్షత్రియ పాఠశాల ఎల్లప్పుడు ముందుంటుందని, విద్యార్థులు చదువుతోపాటు దైవభక్తిని అలవర్చుకొని ఆదర్శ పౌరులుగా ఎదగాలని స్వామిగారు ఆకాంక్షించినారు. విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి జ్యోత్స్న పాండే వారి వందన సమర్పణ తో ఈ పండుగ కార్యక్రమం ముగిసింది.

