ఉద్యానం పరిశుభ్రం ఉత్సాహంగా 49వ వారం స్వచ్ఛ కాలనీ కార్యక్రమం. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్): ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 49 వారానికి చేరింది. 49వ ఆదివారం కాలనీ వాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించి కాలనీలోని రోడ్దు నెంబర్ 8 లో ఉన్న ఉద్యానాన్ని పరిశుభ్రం చేశారు. నిర్వహించారు. ఉద్యానంలో అడ్డదిడ్డంగా పెరిగిన చెట్ల కొమ్మలను కట్టర్ తో కత్తిరించారు. ముళ్ల పొదలను, పిచ్చి మొక్కలను తొలగించారు. ఉద్యానంలో ఉన్న వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని ఒకచోట కుప్పగా పోసి నిప్పంటించారు. ఈ సందర్బంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ 49 వారాలుగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పట్టణంలోని ఇతర కాలనీలకు ఆదర్శంగా నిలుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంతో కాలనీవాసులకు పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరిగిందని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఆదివారం 50 వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ స్వర్ణోత్సవం నిర్వహిస్తామని, ప్రజాప్రతినిధులను, అధికారులను, ప్రముఖులను కార్యక్రమానికి ఆహ్వానిస్తామని తెలిపారు. కాలనీ ఉపాధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ది కమిటి ఆద్వర్యంలో నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమానికి సహకరిస్తున్న కాలనీ వాసులకు, పురపాలక అధికారులకు, సిబ్బందికీ ధన్యవాదాలు తెలిపారు. కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, ఉపాద్యక్షులు సుంకే శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కార్యదర్శులు కొంతం రాజు, ఎల్.సాయన్న, కాలనీ పెద్దలు ఎల్.టి కుమార్ స్వామి, ఎర్ర భూమయ్య, సదమస్తుల గణపతి, మాస్టర్ కృషి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
Related Posts