Telugu Updates

తోటి పశువైద్యురాలు డాక్టర్.అశ్విని కు ఆత్మీయ వీడ్కోలు.. -డాక్టర్ లక్కం ప్రభాకర్(మండల పశుసంవర్థకశాఖ అధికారి).

Post top

తోటి పశువైద్యురాలు డాక్టర్.అశ్విని కు ఆత్మీయ వీడ్కోలు. డాక్టర్ లక్కం ప్రభాకర్ (మండల పశుసంవర్థకశాఖ అధికారి). ఆర్మూర్(తెలంగాణ ఫోకస్ – మీ పొన్నాల) జూన్06: గత ఆరు సంవత్సరాలుగా సుర్బీర్యాల్ గ్రామ పశువైద్యశాలలో పశువైద్య అధికారిగా రైతులకు మరియు మూగ జీవాలకు ఎనలేని సేవలు అందించి, ఇప్పుడు పై చదువుల కోసం, పీజీ వైద్య విద్య కోసం హైదరాబాద్ లోని పశువైద్య విశ్వవిద్యాలయంకు వెళ్తున్న సందర్భంగా గురువారం సర్బిర్యాల్ గ్రామ పశువైద్యశాలలో ఆత్మీయ వీడ్కోలు పలికారు
ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మరియు ఆలూరు గ్రామాలలో పని చేస్తున్న పశువైద్య సిబ్బంది సుర్బిర్యాల్ కు వచ్చి డాక్టర్ అశ్విని ను ఘనంగా సన్మానించారు. నేను పశువైద్యంలో ఇంకా పై చదువులు చదవాలి, రైతులకు మరియు మూగ జీవాలకు ఇంకా నాణ్యమైన సేవలు అందించాలి, యూనివర్సిటీ ను ప్రజలను కలిపే సంధాయక కర్తగా నేను ఉండాలి అంటూ… పశువైద్య విద్యలో రోజురోజుకు వస్తున్న మార్పులను, మెలకువలను నేర్చుకుని, తిరిగి మళ్ళీ గ్రామీణ వాతావరణంలో ఉన్న పేద ప్రజలకు సేవ చేయడానికి మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళడం జరిగింది. మిత్రులారా, యూనివర్సిటీ చదువులు అంటేనే కాస్త కష్ట సాధ్యం ఐన చదువులు. ఒంటరిగా ఉన్నప్పుడు, పెళ్ళి కానప్పుడు చదవడమే కష్టం. అలాంటిది డాక్టర్ అశ్విని ఇప్పుడు కుటుంబ భాధ్యతలు నెరవేరుస్తూ, కుమారుడిని చదివిస్తూ, తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకోవడానికి వెళ్ళడం అనేది చదువు పట్ల తనకు ఉన్న ఇష్టాన్ని మనకు గుర్తుచేస్తుంది. వెటర్నరీ మెడిసిన్ లో నేను బంగారు పతకం సాధించుకుని మళ్ళీ తిరిగి వస్తాను, పశు వైద్యంలో కొత్తగా వస్తున్న మెలకువలు నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడి ప్రజలకు మళ్ళీ సేవలు అందిస్తాను అని చెప్పి వెళ్ళడం డాక్టర్ గారికి ఇక్కడి ప్రాంతం పట్ల, ఇక్కడి ప్రజల పట్ల ఉన్న కృతజ్ఞతను తెలియజేస్తుంది.              తన పై చదువుల కోసం డాక్టర్ అశ్విని కంటున్న కలలన్నీ నెరవేరాలని ఆర్మూర్ మండల పశు సంవర్ధక శాఖ మనస్పూర్తిగా కోరుకుంటుందని డాక్టర్ లక్కం ప్రభాకర్ మండల పశుసంవర్ధక శాఖ అధికారి తెలిపారు. పీజీ ఐపోయాక ఎక్కడ ఉద్యోగానికి వెళ్ళినా కూడా, అక్కడి ప్రజలకు అక్కడి పశుసంపదకు సేవలు చేసి మంచి పేరు సంపాదించాలని ఆర్మూర్ మండల పశువైద్య మరియు సంవర్ధక శాఖ మనస్పూర్తిగా కోరుకుంటుంది. ఈ కార్యక్రమంలో జూనియర్ వెటర్నరీ అధికారి రాజేశ్వర్, లైవ్ స్టాక్ అసిస్టెంట్ శ్రీనివాస్ గౌడ్, వెటర్నరీ అసిస్టెంట్ లు రాధ, దివ్య, పశువైద్య సిబ్బంది నాగార్జున, వసంత, నర్సయ్య, సత్యం, వాజిద్, గోపాలమిత్రలు సురేష్ మరియు రాజన్న లు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.