చేపూర్ దత్త సాయి ఆలయంలో అభిషేకాలు, పూజలు అన్నదాన కార్యక్రమం. ఆర్మూర్(ప్రజాజ్యోతి ఆర్.సి)జూన్06:ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో గల దత్త సాయి ఆలయంలో భక్తులు సాయినాథునికి పంచామృతాలతో అభిషేకాలు,పూజలు నిర్వహించారు.తర్వాత పూజారి కిరణ్ జోషి హారతి ఇచ్చి,భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.తదనంతరం భక్తులు ఆవరణలోని దుని హోమగుండం, గణేషుని ఆలయం, వీరాంజనేయ స్వామి ఆలయం, వాగ్దేవి సరస్వతి మాత విగ్రహాన్ని, దత్త సాయి ఆలయాలను సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ గురువారం అన్నదాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మోహన్ రెడ్డి,చేపూర్ గ్రామ ఎంపీటీసీ బాల నర్సయ్య లు మాట్లాడుతూ.. ప్రతి గురువారం చేపూర్ దత్త సాయి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని, ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తులు తాము కోరుకున్న కోరికలు సఫలీకృతమైతున్న సందర్భంగా తమ తమ మొక్కు తీర్చుకోవడానికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఎవరైనా అన్నదాన కార్యక్రమం నిర్వహించదలచిన వారు ఆలయ కమిటీ వారికి 6000 రూపాయలు చెల్లిస్తే వారి కుటుంబ సభ్యుల పేరు మీద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చని తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించ దలచినవారు లేదా శాఖాహారంతో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసే వారి కొరకు ఇక్కడ కల్యాణ మండపం,వంటగది,నీటి వసతి ఏర్పాటు చేయడం జరిగిందని, కళ్యాణ మండపం బుక్ చేసుకునే సౌకర్యం కూడా ఉన్నదని, అన్నదానం చేయాలన్నా, కళ్యాణ మండపం బుకింగ్ చేసుకోవాలన్నా క్యాషియర్ భూమన్న ఫోన్ నంబర్ 9030425801 కు ఫోన్ చేసి సంప్రదించగలరు. ఈ కార్యక్రమంలో దత్త సాయి ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్, క్యాషియర్ భూమన్న,కార్యవర్గ సభ్యులు పేట్ల సంజీవ్,ఎర్మా భూమేశ్వర్,ఆగాలాడివిటీ పున్ని,చిట్యాల ఆంజనేయులు, కొనింటి అనిల్,మాధ సాయికుమార్, చేపూర్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.