Telugu Updates

స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలు వాహనాలను తనిఖీ చేసిన ఆర్మూర్ ఎం.వి.ఐ. వివేకానంద్ రెడ్డి.

Post top

స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పలు వాహనాలను తనిఖీ చేసిన ఎం.వి.ఐ వివేకానంద్ రెడ్డి.                ఆర్మూర్(ప్రజాజ్యోతి ఆర్.సి) జూన్ 6:
జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డి. తనిఖీలను గురువారం నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా ఆర్మూర్ పోలీస్ శాఖ సంబంధిత శాఖల అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించి వాహనానికి సంబంధించిన సరైన ధ్రువపత్రాలు లేనివారికి జరిమానా విధించినట్లు ఆర్మూర్ ఎం.వి.ఐ అధికారి వివేకానంద్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానంద్ రెడ్డి. మాట్లాడుతూ.. వాహనదారులు వాహనానికి సంబంధించిన ధ్రువపత్రాలను ధ్రువపత్రాలను వారి వెంటే ఉంచుకోవాలని వారు సూచించారు. లేనియెడల జరిమానాతో పాటు శాఖ పురమైనటువంటి చర్యలు తీసుకుంటామని వాహనదారులు హెచ్చరించారు మైనర్ యువకులు వాహనాన్ని నడిపితే వారి తల్లిదండ్రులకు శాఖపరమైనటువంటి చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని, లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపద్దని, వాహనానికి సంబంధించిన పత్రాలు వెంటే ఉంచుకొని ఉండాలని, ఓవర్ లోడ్ ను తరలించొద్దని,ప్రతి ఒక్క వాహనదారుడు శాఖ పరమైన నిబంధనలకు లోబడి ఉండి గమ్యానికి చేరుకోవాలని వారు సందర్భంగా హెచ్చరించారు. ఇందులో భాగంగా ఆర్మూర్ పోలీస్ శాఖ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.