ఆర్మూర్ లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల డిగ్రీ కళాశాలలో పర్యావరణ దినోత్సవం. ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్) జూన్ 05:తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళ గురుకుల కళాశాల ఆర్మూర్ నందు బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ జి.ధనవేణి మాట్లాడుతూ.. పర్యావరణాన్ని రక్షిస్తే మానవ మనగడ సాధ్యమని వారు అన్నారు. భూమి పునరుద్ధీకరణ, ఎడారీకరణను ఆపడం, పచ్చదనాన్ని పెంచడం పలు అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులచే కళాశాల నుండి హౌసింగ్ బోర్డ్ కాలనీ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. విద్యార్థులు “పచ్చని చెట్లు – ప్రగతికి మెట్లు” ”చెట్లని నాటండి – పర్యావరణాన్ని రక్షించండి.” చేయి చేయి కలుపుదాం.. ప్రతి ఒక్కరం మొక్కలను నాటుదాం.. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.. భవిష్యత్తు తరాలను కాపాడుకుందాం.. అంటు నినాదాలు చేశారు.
రజిత బిఎస్సి మొదటి సంవత్సరం విద్యార్థిని తన పాట ద్వారా పర్యావరణ పరిరక్షకు సంబంధించిన సందేశాన్ని అందించారు. కళాశాలలో అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ, ప్రధాన కూడలి చౌరస్తాలో మానవహారం చేపట్టి పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి.ధనవేణి, వైస్ ప్రిన్సిపాల్ ఎన్.శరణ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.