Telugu Updates

కాంగ్రెస్ నాయకుడిపై బిఆర్ఎస్ నాయకుడి దౌర్జన్యం.. -పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఎం.డి సలీం.

Post top

కాంగ్రెస్ నాయకుడిపై బిఆర్ఎస్ నాయకుడి దౌర్జన్యం..
— పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు ఎం.డి సలీం.   ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) మే31:ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని గల ఒక హోటల్ వద్ద శుక్రవారం కాంగ్రెస్ మైనార్టీ నాయకుడు ఎండి సలీం తో బిఆర్ఎస్ నాయకుడు అల్జాపూర్ మహేందర్ దౌర్జన్యానికి దిగినట్లు బాధితులు పేర్కొన్నాడు. ఈ విషయమై ఎండి సలీం ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. పెర్కిట్ గ్రామానికి చెందిన దొంద నాగభూషణం కు సర్వేనెంబర్ 436/2 లో 1 ఎకరం 35 గుంటల భూమి ఉంది. ఇట్టి భూమి తాత ముత్తాతల నుండి వారసత్వంగా ఉండడం మూలంగా సాగు చేసుకుంటున్నారు. కాగా ఇందులో 20 గుంటల భూమి తక్కువ రావడంతో పట్టాదారులు అధికారులను సంప్రదించి సర్వే చేయించుకునే క్రమంలో ఎండి సలీం ప్రమేయం ఉందని తెలుసుకున్న మహేందర్ దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే సర్వే చేపట్టిన అధికారులు 20 గుంటల స్థలం సర్వేనెంబర్ 436/1ను ఆనుకుని ఉందని తెలిపారు. ఇదే విషయమై పట్టేదారులకు కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ 20 గుంటల భూమి ఇవ్వకుండా పలుమార్లు అల్జాపూర్ మహేందర్ అడ్డుకున్నాడని పట్టాదారులు తెలిపారు. కాగా సర్వేనెంబర్ 436/2 పట్టాదారులకు ఎందుకు సహకరిస్తున్నావని శుక్రవారం ఉదయం నానా రీతిగా దుర్భాషలాడుతూ దాడికి దిగిన అల్జాపూర్ మహేంద్ర పై చట్టరీత్యా చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని బాధితుడు ఎండి సలీం ఆర్మూర్ పోలీస్ అధికారి ఎస్ హెచ్ ఓ రవికుమార్ ను కోరారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.