బిజెపి ప్రభుత్వంతోనే మహిళలకు అని రంగాల్లో సముచితస్థానం.
— ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మహిళ మోర్చా నాయకురాలు స్వాభావిక గౌడ్.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)మే17: బిజెపి ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తుందని ఆర్మూర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మహిళ మోర్చా నాయకురాలు స్వాభావిక గౌడ్ అన్నారు.
ఈ సందర్భంగా బిజెపి పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ మహిళా మోర్చా నాయకురాలు స్వభావిక గౌడ్ మాట్లాడుతూ… వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గౌరవిస్తూరని ఆమె ప్రకటనలో పేర్కొన్నారు.
కొన్ని సహస్రాబ్దులుగా భారతదేశంలో మహిళల పాత్ర అనేక గొప్ప మార్పులకు లోనౌతూ వచ్చిందని, ప్రాచీన కాలంలో పురుషులతో సమాన స్థాయి కలిగివున్న భారతీయ మహిళలు మధ్యయుగంలో అధమ స్థాయికి అణచబడటం, అనేకమంది సంఘ సంస్కర్తలు తిరిగి వారికి సమాన హక్కుల కల్పన కోసం కృషి చేయడం, ఇలా భారతదేశంలో మహిళల చరిత్ర అనేక సంఘటనల సమాహారంగా ఉంది. భారతదేశంలో బిజెపి ప్రభుత్వం దేశ మహిళలకు సమచిత స్థానం కల్పిస్తూ మహిళలకు సమాన హక్కులకు కల్పిస్తుందని,దేశ రాష్ట్రపతి,మంత్రిలు,లోక్‌సభ సభాపతి, ప్రతిపక్ష నాయకురాలు వంటి అత్యున్నత పదవులను మహిళలకు అలంకరించారని గుర్తు చేశారు. భారతదేశపు ఇటీవలి రాష్ట్రపతి కూడా ఒక మహిళే అని మరోసారి గుర్తు చేశారు.
రానున్న రోజుల్లో భారత దేశంలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని మూడోసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రావడం దేశ ప్రజలకు అదృష్టం అని అన్నారు. బిజెపి ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు మరింత అన్ని రంగాల్లో సముచిత స్థానాన్ని కల్పిస్తుందని స్థానిక ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ అభివృద్ధికి, మహిళలకు, పేదలకు సంక్షేమ ఫలాలు అదే విధంగా చూస్తారని నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పై ఉండాలని ఆమె ప్రజలను కోరారు.