ఎడ్యూకేషనల్ లీడర్ అవార్డు అందుకున్న విద్య ప్రవీణ్ పవార్. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)మే10: హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హాల్ లొ టైం టు గ్రో మీడియా వారు నిర్వహించిన 20 వ ఎడ్యుకేషనల్ సమ్మిట్ (విద్య సదస్సు) లో భాగంగా ఆర్మూర్ పట్టణం లోని విద్య హైస్కూల్ అధినేత విద్య ప్రవీణ్ పవార్ కు విద్యా రంగం లో ఉత్తమ సేవలు అందిస్తున్నందుకు ఎడ్యుకేషనల్ లీడర్ అవార్డు ను ప్రదానం చేయడం జరిగింది…ఇట్టి కార్యక్రమంలో టైం టు గ్రో మీడియా వ్యవస్థాపకులు మన్మీత్ ఖురణ ,తెలంగాణ ప్రభుత్వ మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సిల్వర్ ఓక్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సీతా మూర్తి, తెలంగాణ రాష్ట్ర ప్రముఖ పాఠశాలల డైరెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.