Telugu Updates

అన్ని వర్గాల అభివృద్దె కాంగ్రెస్ ధ్యేయం. -కాంగ్రెస్ ఇంచార్జి పి.వినయ్ రెడ్డి.

Post top

అన్ని వర్గాల అభివృద్దె కాంగ్రెస్ ధ్యేయం. -కాంగ్రెస్ ఇంచార్జి పి.వినయ్ రెడ్డి.

–కాంగ్రెస్ లో చేరిన నందిపేట్ మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు జావీద్.
–మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు గోపు ముత్యం.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)మే10: ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు, ఖుదాన్పూర్ గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మొహమ్మద్ జావిద్ నాయకత్వంలో వివిధ గ్రామాల మస్జీద్ కమిటీ అధ్యక్షులు బి ఆర్ఎస్ పార్టీ ని వీడి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వినయ్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముస్లిం కమిటి మండల అధ్యక్షుడు జావిద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులయి, దేశం లో గల హిందూ ముస్లిం భాయి-భాయి & గంగ జామున తహజిబ్ పరంపర కొనసాగాలంటే జాతీయ స్థాయిలో గల సెక్యులర్ పార్టీ నేత రాహుల్ గాంధీ కి ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీలు మద్దతు ఇచ్చే సమయం వచ్చింది కావున పార్టీలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. వినయ్ రెడ్డి మాట్లాడుతూ తన పై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి జగిత్యాల జీవన్ రెడ్డి పై నమ్మకం తో కాంగ్రెస్ లో చేరిన మండల ముస్లిం కమిటి నేతలకు, ఉప సర్పంచ్ ల ఫారం మాజీ అధ్యక్షుడు గోపు ముత్యం తో కలిసి జాయిన్ అయినా బజార్ కొత్తూరు గ్రామం నాయకులకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాబోయే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉందని అన్ని మతలకు సమాన ప్రాధాన్యత ఇస్తదాని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ , మాజీ కో-ఆప్షన్ & మాజీ సర్పంచ్ మజరుద్దిన్,సొసైటీ చైర్మన్ బొంకమ్ గంగారెడ్డి, మండల కమిటి ఉపాధ్యక్షులు మొయిన్, ఫరీద్ వివిధ గ్రామాల మస్జీద్ కమిటీ అధ్యక్షులు, పార్టీ మైనారిటీ సెల్ నాయకులు ఇసుబ్, ఖదీర్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.