ఓటు హక్కును వినియోగించుకున్న స్వాతంత్ర సమరయోధుడు దొండి జగ్గే శివదాస్.
— ఓటుతోనే చైతన్యవంతమైన ప్రజాస్వామ్యం.
— ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో కీలకం.
ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్)మే3: ప్రతి ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని స్వాతంత్ర సమరయోధులు ఆర్మూర్ వాసి జగ్గే శివదాస్ పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆర్మూర్ పట్టణానికి (పట్టుకరి)క్షత్రియ కులానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు దొండి జగ్గే శివదాస్ (93)గల వృద్దుడు తన ఓటు హక్కును వారి స్వగృహంలో వినియోగించుకున్నారు.
Related Posts
ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు దొండి జగ్గే శివదాస్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా అందరూ కూడా తమ ఓటు హక్కును తప్పనిసరి వినియోగించుకోవాలని వారు సందేశాన్ని ఇస్తూ తన ఓటు హక్కుని వినియోగించుకొని ఆనందాన్ని వ్యక్తం చేశారు.
లోకసభ ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంపు దిశగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను, కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులను ఆయన అభినందించారు.
ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో శుక్రవారం 3, 4, 5, 6 తేదీలలో హోమ్ ఓటింగ్ నిర్వహించేలా అవసరమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి,జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లాకు సంబంధించిన అన్ని శాఖ అధికారులను స్వాతంత్ర సమరయోధులు అభినందించారు.
ముఖ్యంగా సమాజంలోని విద్యావంతులు, ప్రజలు ఓటు విలువ తెలుసుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో నిజాయితీగా ఓటు వేయాలని కోరారు. యువత ఓటు వినియోగించడంలో నిజాయితీని ప్రదర్శించాలని సూచించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు చాలా విలువైనదని, దాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఓటు హక్కు దేశ సంక్షేమానికి అభివృద్ధికి పునాది లాంటిదన్నారు. డెమోక్రసీని కాపాడుకోవాలంటే ఒకే ఒక్క ఆయుధం ఓటు అన్నారు. ఒక ఓటు ఒక మంచి సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ఓటుహక్కే ఆధారమని స్వాతంత్ర సమరయోధుడు దొండి జగ్గే శివదాస్ అన్నారు.