ఆలూరు మైనార్టీ రెసిడెన్షియల్ విద్యార్థుల ప్రతిభ. -విద్యార్థులను అభినందించిన ప్రిన్సిపాల్ సయ్యద్ హైదర్.
ఆలూరు మండల న్యూస్(తెలంగాణ ఫోకస్): ఆలూరు నందు గల తెలంగాణ మైనారిటీ ఆర్మూర్ బాలుర పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులు 2024 ఇంటర్ పరీక్షలలో మంచి మార్కులతో ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపాల్ సయ్యద్ హైదర్ గారు తెలియ చేసారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం నుండి జి.ప్రసాద్ ఎంపీసీ విభాగంలో 976/1000, సయ్యద్ ఆరీమ్ బైపీసీ విభాగంలో 965/1000 మార్కులు సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం నుండి జే.రామ్ చరణ్ ఎంపీసీ విభాగం నుండి 454/470, కే. జస్వంత్ బై.పిసి నుండి 419/440 మార్కులు సాధించారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో ఏ.మనోహర్- 972/1000, శేక్ షాజాన్ -954/1000, ఏమ్.డి దానిష్- 916/1000, అబ్దుల్ మౌసీన్- 913/1000, శేక్ రయ్యాన్ ఆలీ- 905/1000. ఇంటర్ సెకండ్ ఇయర్ బైపిసి లో సయ్యద్ ఆరీఫ్ 932/1000. ఇంటర్ మొదటి సంవత్సరం లో వి. నిఖిల్ 438/470, ఎన్. సాయిరాం 438/470 మార్కులు సాధించారని తెలియ చేసారు.