ఆర్మూర్ ఎంపీపీ, మండల అధ్యక్షులు బిఆర్ఎస్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా.
— పలువురు బిఆర్ఎస్ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరిక.
Related Posts
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) ఏప్రిల్ 16: ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి, పలువురు ఎంపీటీసీ లు, మాజీ సర్పంచులు, మండల నాయకులు బిఆర్ఎస్ పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సమక్షంలో భారీ సంఖ్యలో టిఆర్ఎస్ ను విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలపరచి ప్రజాస్వామ్యానికి మద్దతు ఇచ్చుట కొరకు, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్ ఎంపీపీ పస్కా నర్సయ్య, ఆర్మూర్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు ఆలూర్ శ్రీనివాస్ రెడ్డి లు తెలిపారు, వీరితోపాటు ప్రముఖ సీనియర్ నాయకులు మండల ఎంపీటీసీ లు, పలువురు సీనియర్ నాయకులు కూడా కాంగ్రెస్ లో చేరారు.ఇన్ని రోజుల ప్రయాణంలో మాకు రాజకీయంగా సహకరించిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.