Telugu Updates

ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఫారం12-డీ పంపిణీ. -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

Post top

ఇంటి నుండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఫారం12-డీ పంపిణీ. -కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

నిజామాబాద్(తెలంగాణ ఫోకస్)ఏప్రిల్ 01: ప్రస్తుత పార్లమెంటు ఎన్నికలలో 85 సంవత్సరాల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లు, దివ్యంగులు ఇంటి వద్ద నుండే ఓటు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా వారికి ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్దేశించబడిన నిర్ణీత ఫారం 12-డీ లను పంపిణీ చేయిస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు ఓటరు జాబితాలో మార్కింగ్ చేయబడిన సీనియర్ సిటిజన్ ఓటర్లు, దివ్యంగ ఓటర్ల ఇళ్లకు వెళ్లి ఫారం 12-డీ అందజేస్తున్నారని అన్నారు. జిల్లా పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో 85 సంవత్సరాలు పైబడిన ఓటర్లు 7555 మంది ఉండగా, మార్చి 30 నాటికే 3331 మందికి ఫారం 12-డీ అందజేయడం పూర్తయ్యిందని వివరించారు. అదేవిధంగా దివ్యంగులైన ఓటర్లు 24229 మంది ఓటరు లిస్టులో మార్కింగ్ చేయబడి ఉండగా, వారిలో 10175 మందికి నిర్ణీత ఫారాలను సమకూర్చడం జరిగిందన్నారు. అర్హత కలిగి ఉన్న 85 ఏళ్ళు పైబడిన, దివ్యంగ ఓటర్లందరికి వారు ఇంటి నుండే ఓటు వేసేందుకు వీలుగా ఫారం 12-డీ అందజేసేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇంటి నుండి ఓటు వేయదల్చిన వారు తమ సమ్మతి తెలుపుతూ పూరించిన ఫారం 12-డీ ని ఈ నెల 20 వ తేదీ వరకు అందజేయాల్సి ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను పాటిస్తూ, పోలింగ్ అధికారుల బృందాలు వారి ఇళ్లకు వెళ్లి పూర్తి పారదర్శకంగా వీడియో చిత్రీకరణ నడుమ ఓటింగ్ ప్రక్రియను నిర్వహిస్తాయని, సీక్రెట్ ఓటింగ్ కోసం ఓటింగ్ కంపార్ట్ మెంట్ ను కూడా ఏర్పాటు చేస్తారని అన్నారు. కాగా, అత్యవసర సర్వీసుల పరిధిలోకి వచ్చే 13 శాఖల ఉద్యోగులకు సైతం పోస్టల్ బ్యాలెట్ వెసులుబాటు కల్పించడం జరిగిందని, దీనిని వినియోగించదల్చిన వారు సైతం ఈ నెల 20వ తేదీ వరకు సంబంధిత రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో ఫారం-12 (డి)లు అందించాలని కలెక్టర్ సూచించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.