నేషనల్ ఛాంపియన్షిప్ 90 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఢిల్లీ లో ప్రతిభను కనబరిచిన ఆర్మూర్ వాసి జెస్సు వెంకట్.
నేషనల్ ఛాంపియన్షిప్ 90 కేజీల వెయిట్ లిఫ్టింగ్ ఢిల్లీ లో ప్రతిభను కనబరిచిన ఆర్మూర్ వాసి జెస్సు వెంకట్. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)ఏప్రిల్1: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన జెస్సు స్రవంతి శ్రీనివాస్ కుమారుడు ఆదివారం జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్ 90 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో బ్రౌన్ మోడల్ ప్రథమ స్థానం సాధించినట్లు వారి తల్లిదండ్రులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఢిల్లీలో ఆదివారం జరిగిందని వెయిట్ లిఫ్టింగ్ శిక్షకులు (కోచ్)రాఘవ తెలిపారు. ఆయన కుమారుడు జెస్సు వెంకట్ ఒకవైపు డిగ్రీ చదువుతునే శారీరకంగా దృఢంగా ఉంటూ “వెయిట్ లిఫ్టింగ్” రంగం ను ఎంచుకొని ఆ రంగంలో దూసుకెళుతున్నాడని వారి తల్లిదండ్రులు జేస్సు స్రవంతి శ్రీనివాస్ లు తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాల్లో వారి ప్రతిభను కనబరిచి సమాజంలో మంచి పేరు తెచ్చుకొని ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆర్మూర్ పట్టణ ప్రముఖులు సీనియర్ జర్నలిస్ట్ రాజేశ్వర్ గౌడ్ అన్నారు. పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రెసిడెంట్ రేఖ ఇంతురి, జనరల్ సెక్రెటరీ సుధీర్ కుమార్, ట్రెజరర్ విజయ్ గోవాడ గారి ఆధ్వర్యంలో జెస్సు వెంకట్ కు ఘనంగా శాలువా మెమొండలతో సన్మానించారు. తల్లిదండ్రులు జెస్సు స్రవంతి శ్రీనివాస్ కుమారుని చూసి జెస్సు స్రవంతి శ్రీనివాస్ (ఆర్మూర్ ఆర్టీసీ మెకానిక్ ఉద్యోగి) ఆనందోత్సవంలో మునిగారు. ఈ సందర్భంగా ఆర్టీసీ మెకానిక్ ఉద్యోగి, జెస్సు శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పిల్లలు చదువుతోపాటు అన్ని రంగాల్లో ముందుండి ప్రయోజకులు కావాలని తల్లిదండ్రులను కోరారు.
విద్యార్థి దశ నుండి ఓ ఆశయం పెట్టుకుని సాధించుకునే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆర్మూర్ పట్టణ ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజేశ్వర్ గౌడ్ విద్యార్థులకు పిలుపునిచ్చారు