ఈ నెల 22న ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ జిల్లా పర్యటన. -ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి బచ్చపల్లి దేవయ్య వెల్లడి.
ఈ నెల 22న ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ జిల్లా పర్యటన.
– ఆర్మూర్ నియోజకవర్గ ఇంఛార్జి బచ్చపల్లి దేవయ్య వెల్లడి.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)ఫిబ్రవరి18: ఈనెల 22న ఎమ్మార్పీఎస్ టిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా పర్యటించనున్నాట్లు ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ టీఎస్ ఇంచార్జ్ బచ్చపల్లి దేవయ్య మీడియాకు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సల్లూరి శ్రీనివాస్ మాదిగ మహిళ జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి నగర అధ్యక్షులు గిన్నారం రవి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గార్ల పిలుపుమేరకు ఆర్మూర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న మాదిగ మాదిగ-ఉపకులాల సంఘ నాయకులు, కార్యకర్తలు ఏకమై తమ సమస్యలను ముక్తకంఠంతో రాష్ట్ర అధ్యక్షుల వారికి చెప్పుకోవచ్చని తమ తమ సమస్యలను పరిష్కరించేదిశలో రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తూ ఈనెల 22న నిజామాబాద్ జిల్లాకు విచ్చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న మాదిగ మాదిగ-ఉపకులాల నాయకులు ఈనెల 22న జరిగే సమావేశానికి అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చపల్లి దేవయ్య కోరారు.
రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ పర్యటనలో భాగంగా ప్రధాన అంశాలు అయినటువంటి మాదిగ మాదిగ ఉప కులాలకు డప్పు చెప్పు మృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలని, పారిశుద్ధ కార్మికులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లు వివరించారు
ఈనెల 22న నిజామాబాద్ లో జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వంగపల్లి శ్రీనివాస్ హాజరుకానున్నా శుభ సందర్భంగా ఎమ్మార్పీఎ టిఎస్ నాయకులందరూ, ముఖ్య కార్యకర్తలు హాజరు కావలసిందిగా ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా ఎమ్మార్పీఎస్ టిఎస్ నాయకులను బచ్చపల్లి దేవయ్య కోరారు.
విలేకరుల సమావేశంలో టీఎస్ ఎంఆర్పిఎస్ నాయకులు కందుల రాములు కొత్తూరు శేఖర్ కందుల శ్రీనివాస్ తదితరులు నాయకులు పాల్గొన్నారు