Telugu Updates

ఆర్మూర్ లో  కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సభ – భారీ ప్రదర్శన.

Post top

ఆర్మూర్ లో  కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సభ – భారీ ప్రదర్శన.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)ఫిబ్రవరి16:
నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్పొరేట్, మత విధానాలకు నిరసనగా ఎస్ కే యం, కార్మిక సంఘాల జేఏసీ పిలుపుమేరకు ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం ఉదయం అంగడి బజార్ లో సభ నిర్వహించి అనంతరం ఆర్మూరు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.

ఈ సభకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వెంకటేష్ అధ్యక్షత వహించగా ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు సిఐటియు జిల్లా నాయకులు చంద్రకళ ఐఎఫ్టియు అధ్యక్షులు ముత్తన్న, భీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిసూర్య శివాజీ, ఏ ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు సుధాకర్, పాల్గొని ప్రసంగిస్తూ బిజెపి అధికారం చేపట్టి పది సంవత్సరాలు పూర్తయిన, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతాంగ, కార్మికవర్గ ప్రజల సమస్యల్ని పరిష్కరించకుండా, ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతోందనీ వారు అన్నారు. 2023 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసిందని వారు తెలిపారు. ప్రతి ఏటా రెండు కోట్ల కొలువుల మాట నీళ్ల మూటగా మారిందని వారన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి పేదవారి బ్యాంక్ ఖాతాల్లో 15 లక్షల జమ హామీ అమలుకు నోచుకోలేదని వారు తెలిపారు. కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దుచేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను మోడీ సర్కార్ తెచ్చిందని వారు తెలిపారు. పీఎఫ్, ఇ ఎస్ ఐ వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తుందని, 12 గంటల పని విధానం అమలకు ప్రయత్నిస్తుందని వారు అన్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8 వ కమిషన్ నియమించకుండ జాప్యం చేస్తుందని విమర్శించారు. 2016 అక్టోబర్ 26 సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మోడీ ప్రభుత్వం చెత్తబుట్టలో పడేసిందని వారు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని వారు విమర్శించారు.

2014లో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించిన పంటకు ఎం ఎస్ పి.చెల్లిస్తామని హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టుకొలేదని వారన్నారు. రోడ్ సేఫ్టీ బిల్లు పేరుతో ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతీయడం దుర్మార్గమన్నారు.విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఆపాలని, మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళన పై మోడీ సర్కార్ భాష్పవాయువు ప్రయోగించి ఉద్యమ అణిచివేతకు కుట్ర చేయడం దుర్మార్గమని వారన్నారు. ఒక దిక్కు ఆ శాస్త్రీయ భావజాలాన్ని రుద్దుతూ, హక్కుల కోసం తెగించి ఉద్యమిస్తే నిర్బంధిస్తున్నారని వారు తెలిపారు. నిరుద్యోగం, అధిక ధరలు ,పేదరికం, ఆకలి, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా, మత వైషమ్యాలు ను రెచ్చగొట్టి అధికారంకోసం ఆరాటపడుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు భూమన్న, మధ్యాహ్న భోజనం సంగం సుజాత, తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు ధనలక్ష్మి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు నరాటిలక్ష్మణ్, వ్యవసాయ కార్మిక సంఘం గంగన్న, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దేవన్న , బాబురావు ఐఎఫ్టియు నాయకులు నజీర్,సొప్పరి గంగాధర్,అరుణోదయ జిల్లా కార్యదర్శి అబ్దుల్, సిఐటియు నాయకులు శంకర్, జగదాంబ ఏఐఎఫ్టి యు నాయకులు పెద్దులు, టి శ్రీనివాస్ ,బి రాజు, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.