పాపను గంటలోపు తండ్రికి అప్పగించిన పోలీసులు.. -కానిస్టేబుల్, హోంగార్డు లను అభినందించిన ఆర్మూర్ సిఐ రవికుమార్.
పాపను గంటలోపు తండ్రికి అప్పగించిన పోలీసులు.. — కానిస్టేబుల్, హోంగార్డు స్వామి లను అభినందించిన ఆర్మూర్ సిఐ రవికుమార్.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) ఫిబ్రవరి 05: ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజారాం నగర్ కాలనీకి చెందిన షేక్ నహీం కూతురు షేక్ మహేరా (7) తప్పిపోయిందని పాప తండ్రి 100 కి కాల్ చేసి పోలీసులకు వివరాలను వెల్లడించారు.దీనికి స్పందించిన పట్టణ సిఐ వి. రవికుమార్ ఆదేశాల మేరకు పోలీసులతో ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.రాజారాం నగర్ కాలనీ నుండి మూగదైన పాప ఆడుకుంటూ
మామిడిపల్లి చౌరస్తా వరకు వెళ్ళింది. పాపను వెతికే క్రమంలో కానిస్టేబుల్ రాములు, హోంగార్డు స్వామి పాపను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. తదననంతరం పాప తండ్రికి కాల్ చేసి సిఐ సమక్షంలో తండ్రి షేక్ నహీం కు అప్పగించారు. చాకచక్యంతో పాపను పట్టుకున్న కానిస్టేబుల్, హోంగార్డును సిఐ అభినందించారు.