సెయింట్ పాల్స్ హైస్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఘనంగా స్పోర్ట్స్ డే.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)జనవరి 26: గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి లో గల “సెయింట్ పాల్స్” హైస్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఘనంగా “స్పోర్ట్స్ డే” నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.
పాఠశాల ప్రిన్సిపాల్ కేత్రిన్ పాల్, కరస్పాండెంట్ ఏనక్ పాల్ (బబ్లు)పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో “స్పోర్ట్స్ డే” కార్యక్రమం ను విద్యార్థులు ఉత్సాహంగా ఉల్లాసాన్ని ఆటల ప్రదర్శనలతో తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో తల్లిదండ్రులను ఆకట్టుకున్నారు
పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి కేత్రిన్ పాల్ మాట్లాడుతూ.. ఆటలు మరియు క్రీడలు నేటి విద్యతో అంతర్భాగంగా మారాయని వారికి క్రమశిక్షణ క్రీడా స్ఫూర్తి టీం స్పిరిట్ మరియు నాయకత్వ లక్షణాలు తప్పనిసరని ఇవి పిల్లల శారీరక మానసిక వికాసానికి కూడా పడతాయని దోహదపడతాయని ఆమె అన్నారు.
సెయింట్ పాల్స్ హైస్కూల్ పాఠశాల ఏనక్ పాల్ (బబ్లు) మాట్లాడుతూ.. పాఠశాల క్రీడా దినోత్సవం మరియు జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని తరగతుల విద్యార్థులు చాలా సరదాగా మరియు ఉల్లాసంగా జరుపుకున్నారు. పాఠశాల క్రీడా మైదానం ఉత్సాహం, అభిరుచి మరియు ఉత్సాహంతో నిండిపోయింది. విద్యార్థులు చంద్రయాన్ 3, కరాటే, పలు రకాల డాన్స్ లు, జుంబా, ఏరోబిక్స్, ట్రాక్ ఈవెంట్‌లు, స్కూల్ డ్రిల్ మరియు హూలా హూప్స్ వంటి అనేక రకాల ఎనర్జిటిక్ మరియు బౌన్సీ స్పోర్ట్స్ ఈవెంట్‌లను ప్రదర్శించారు. తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో తల్లిదండ్రులను ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
ఈ క్రీడా దినోత్సవం సందర్భంగా విద్యార్థినీలు కూడా రేసుల్లో పాల్గొని శారీరక దృఢత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని పొందారు. మొత్తం మీద, ఇది నిజంగా పిల్లలకు థ్రిల్లింగ్ అనుభవం. విక్టరీ స్టాండ్‌కు చేరుకున్న విజేతలు పతకాలు సాధించడం గర్వంగా భావించారు. ప్రథమ ద్వితీయ తృతీయ విజేతలకు బహుమతులు ప్రశంస పత్రాలను అందజేశారు. ప్రిన్సిపాల్ శ్రీమతి కేత్రిపాల్ తన ప్రసంగంలో పిల్లల జీవితంలో క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తల్లిదండ్రులు విద్యార్థులకు క్రీడల్లో రాణిచ్చే అవకాశం ఇవ్వాలని చదువుతోపాటు క్రీడలు భవిష్యత్తులో ఎంతో దోహదపడతాయని తల్లిదండ్రులకు సూచించారు.
విద్యార్థుల ఆటలను చూసిన తల్లిదండ్రులు ఎంతో హర్షవ్యక్తం చేశారని తక్కువ సమయంలో విద్యార్థులకు పలు ఆటల కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఉపాధ్యాయులను, పాఠశాల సిబ్బందిని ఆమె ఉపాధ్యాయుల బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు అనిల్,పిఈటి కిషోర్, గడ్డం శ్రీనివాస్, ఉపాధ్యాయులందరినీ ప్రిన్సిపాల్ శ్రీమతి కేత్రిన్ పాల్ అభినందించారు.