నందిపేట్ (తెలంగాణ ఫోకస్):- ఆలూరు లోని మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాల (ఆర్ముర్) లో 2024-25 సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు, ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలంగాణ మైనార్టి పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ హైదర్ పత్రిక ప్రకటన లో తెలిపారు.
5వ తరగతిలో ఉన్న మొత్తం 40 సీట్ల కొరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని, 7, 8, 9 తరగతులలో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు ప్రత్యక్షంగా పాఠశాలకు వచ్చి, పాఠశాల కార్యా లయంలో సర్టిఫికెట్లు ఇవ్వాలని తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 40 సీట్లు, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయని వివరించారు. నాణ్యమైన భోజనంతో పాటు ఉత్తమమైన విద్యను అందిస్తున్నామని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యను బోధించడం జరుగుతుందని పేర్కొన్నారు. జనవరి 18 నుండి ఫిబ్రవరి 06 వరకు విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏదైనా సందేహం ఉంటే 8985783122 నంబర్ పై ఫోన్ చేయాలని కోరారు.
నిజామాబాద్ బాలికలు – 3- మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల, బాలికల కళాశాల జనవరి 18 నుండి అడ్మిషన్ల ప్రారంభం
మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (గర్ల్స్) లో విద్యా సంవత్సరం(2024-25) కొరకు ఐదవ తరగతి మరియు ఇంటర్ ఇయర్ 1 లో BiRC మరియు m.pc లో ప్రవేశం పొందాలనుకునే బాలికల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సయీదా ఫర్షీద్ ఫర్హీన్ తెలిపారు . 2024-25 సంవత్సరానికి, 6,7 మరియు 8 తరగతులకు అడ్మిషన్ కోసం దరఖాస్తులు ఆమోదించబడతాయి.5 తరగతిలో, మైనారిటీ విద్యార్థులను మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన ఎంపిక చేస్తారు, అయితే మైనారిటీయేతర విద్యార్థులను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు.. 6, 7 మరియు 8 తరగతుల యొక్క అడ్మిషన్ల కొరకు టీంరీస్ వెబ్‌సైట్ ద్వార అడ్మిషన్ పొందవచ్చు, మరిన్ని వివరాల కోసం గర్ల్స్ విద్యార్థుల పేరెంట్ దిగువ నంబర్ కు 7995057951 కాల్ చేయా లని ఆమె తెలిపారు.