Telugu Updates

అత్యవసర వైద్య సేవలు అందించేందుకు తాము తమ సిబ్బందితో సిద్ధం. -ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి అధికారి డాక్టర్ నాగరాజు.

Post top

ఏ పరిస్థితుల్లోనైనా అత్యవసర సేవలు అందించేందుకు తాము తమ సిబ్బందితో సిద్ధం.
— ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు, వైద్యుల సలహాలు,సూచనలు తప్పనిసరి పాటించాలి.
— ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి అధికారి డాక్టర్ నాగరాజు 

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) డిసెంబర్21: ఇటీవల కరోనా కొత్త వేరియంట్ కేసులు దేశంలో నమోదయితున్న వేల ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి గురువారం ఒక ప్రకటనలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి అధికారి డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. ఆర్మూర్ లోని ఏరియా ఆసుపత్రి లో కరోనా కేసులకు సంబంధించి వైద్య సేవలు అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ సహిత పడకలు, ఐసోలేషన్ వార్డులు ఇంకా మందులు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ముఖ్య పర్యవేక్షకులు డాక్టర్ నాగరాజు, ఆర్ఎమ్ఓ డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ అమృతరామ్ రెడ్డి, డాక్టర్ సుమంత్, డాక్టర్ శ్రీకాంత్ ఇతర వైద్య సిబ్బంది సేవలు అందించేందుకు అందుబాటులో ఉన్నారని తెలిపారు.ఏ పరిస్థితిలోనైన అత్యవసర సేవలు అందించేందుకు తాము తమ సిబ్బంది అందరూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కరోనా తాత్కాలికమైన జలుబు లాంటిదని, తగిన జాగ్రత్తలు, వైద్య సలహాలు, సూచనలు పాటిస్తే తరిమికొట్టవచ్చని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా కరోనాను ఎదుర్కొనుటకు, కట్టడి చేయుటకు సిద్ధంగా ఉన్నదని, అందరం కలిసి కట్టుగా పోరాడి కరోనాను జయిద్దామని డాక్టర్ నాగరాజు అన్నారు.

కాగా ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ,భౌతిక దూరం పాటించాలని,తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవాలని,సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని,తప్పని పరిస్థితులలో వెళితే తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పెళ్లిళ్లకు,విందులు,వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతిరోజూ గోరువెచ్చని నీరు త్రాగాలని, బలమైన పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. జలుబు, జ్వరం లాంటివి వచ్చి తగ్గని యెడల వెంటనే డాక్టరును సంప్రదించాలన్నారు. పాజిటివ్ వస్తే బయపడవలసిన పనిలేదని, ధైర్యంగా కుటుంబ సభ్యులను కలవకుండా ప్రత్యేక గదిలో ఉండాలని, లేదా ప్రభుత్వ కరోనా కేర్ సెంటర్ లో చేరి వైద్యుల సూచనల మేరకు వారు ఇచ్చిన మందులు క్రమం తప్పకుండా వాడాలని డాక్టర్ నాగరాజు తెలిపారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.