ఏ సర్వేలు చూసినా కారు జోరు కనిపిస్తున్నది. జీవన్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించండి. -మంత్రి హరీష్ రావు.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)నవంబర్18:
ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసిన వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అన్ని సర్వేలు చెబుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
నందిపేట మండల కేంద్రంలో శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డి కి మద్దతుగా మంత్రి హరీష్ రావు, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు రోడ్ షో లో పాల్గొన్నారు. పాత పెట్రోల్ బంక్ చౌరస్తా నుండి నుండి చాకలి ఐలమ్మ విగ్రహం వరకు బిఆర్ఎస్ రోడ్ షో సాగింది. ఐలమ్మ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించే మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలు చెప్పే మాయమాటలు నమ్మవద్దని ఓటర్లను కోరారు. ఆచరణ సాధ్యం కానీ హామీలను ఇస్తున్నారని దుయ్యబట్టారు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆభివృద్ధి ఎలా జరిగిందో మీ అందరికి తెలుసు కాబట్టి కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి జీవన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించి బిఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జీవన్ రెడ్డి ఎంతో పట్టుదల గల వ్యక్తిఅని, ప్రతిక్షణం నియోజకవర్గం అభివృద్ధి కొరకు ఆలోచిస్తాడని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందేటట్టు శ్రమించాడని, ఉమ్మేడ- పంచ గూడా వంతెనను, నందిపేట ఆర్మూర్ వెల్మల్ గ్రామాలలో బైపాస్ రోడ్లను నిర్మించి ప్రజల చిరకాల వాంఛను తీర్చాడని, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన సిసి రోడ్లు డ్రైనేజీలను, పల్లె ప్రగతి పేరుతో గ్రామ గ్రామాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడానికి నిరంతరం కృషి చేశాడని కొనియాడారు