Telugu Updates

అవినీతిని అంతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.

Post top

అవినీతిని అంతం చేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి.
– అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేసిన జీవన్ రెడ్డికీ బుద్ది చెప్పాలి.
– ఎన్నికల ప్రచారంలో ప్రోద్దుటురి వినయ్ కుమార్ రెడ్డి.
మాక్లూర్(తెలంగాణ ఫోకస్)నవంబర్ 16
మాక్లూర్ మండలంలోని దర్మోర, మాందాపూర్, లక్మాపుర్, వెంకటాపూర్, మెట్టు, గొట్టుముక్కల, బొంకాన్ పల్లి, ముల్లంగి(బి), కృష్ణానగర్ గ్రామాలలో గురువారం ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వినయ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.మహిళలు భారీ ఎత్తున మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు తెలుపుతూ,పూల వర్షంతో ఘన స్వాగతం పలికినారు.ఈ గ్రామాల ప్రజలకు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి తన పైన ఇంత అభిమానం ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్బంగా గ్రామాలలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రెండు వారాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం,ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఖేల్ ఖతాం… దుకాణం బంద్.. అని అన్నారు. ఆర్ముర్ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తూ,చేతు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.ఈ ఆర్మూర్ ఎమ్మెల్యే అన్ని సామాజిక వర్గాల ప్రజలను మోసం చేశాడని,ప్రతి గ్రామంలో అన్ని వర్గాల వారు చెప్పడం జరిగిందని అన్నారు.ఆర్మూర్ నియోజకవర్గంలోని అన్ని కుల సంఘాల కమ్యూనిటీ హాల్ కోసం డబ్బులు ఇస్తానని, ఇప్పుడే ఫోన్ పే ద్వారా పంపుతనని,ఐదు సంవత్సరాలు గడిచిన డబ్బులు ఇవ్వలేదని వివిధ గ్రామాలలో సంఘ పెద్ద మనుషులు చెప్పారని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలను 60 రోజులలో అమలు చేస్తుందని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ప్రతినెల 2500 రూపాయలు,వృద్ధప్య పింఛన్లు 4వేలు,ఉచిత కరెంట్,రైతులకు పంటకు 15000,విరాళంగా 500 బోనస్ ఇవ్వబడుతుందని తెలిపారు.రెండు లక్షల ఉద్యోగాలు,విద్యార్థులు పైసలు కోసం రుణాలు ఇస్తామని ఆయన అన్నారు.ఆర్మూర్ నియోజకవర్గంలోని ప్రతి కుటుంబంలో ఉన్న ఓట్లను కాంగ్రెస్ పార్టీకి,హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వినయ్ కుమార్ రెడ్డి వివిధ గ్రామాల ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రవి ప్రకాష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు డేగ పోశేట్టి,గంట చిన్నయ్య,దయాకర్ రావు, గంగాధర్ గౌడ్,డానియల్,జైల్ సింగ్, అరిఫ్, మోహన్, వినోద్, చామంతుల శ్రీనివాస్, రామన్న,కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.