భారత జాగృతి ఆర్మూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. -జీవనన్న గెలుపు కోసం నల్ల పోచమ్మ కు మొక్కు ముడి ప్రత్యేక పూజలు.. -ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్.

భారత జాగృతి ఆర్మూర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ.
— జీవనన్న గెలుపు కోసం నల్ల పోచమ్మ కు మొక్కు ముడి ప్రత్యేక పూజలు..
— ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్.
ఆర్మూర్(TELANGANA FOCUS)నవంబర్13:
ఈనెల 30 వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గం నుంచి మన డైనమిక్ నాయకులు బిఆర్ఎస్ పార్టీ జిల్లా రథ సారథి ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి 60 వేల మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గెలుపొందాలని కాంక్షిస్తూ భారత జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ కన్వీనర్ మక్కల సాయినాథ్ ఆధ్వర్యములో ఆర్మూర్ పట్టణం లోని పాత బస్టాండు నుంచి నల్ల పోచమ్మ మందిరము వరకు వందమంది యువకులతో కలిసి బైక్ ర్యాలి నిర్వహించి
నల్ల పోచమ్మ మందిరం వద్ద రాబోయే ఎన్నికల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే గా జీవనన్న భారీ మెజారిటీతో గెలిచేలా దీవించు తల్లి అని
నల్లపోచమ్మకు మొక్కు ముడిగట్టి మందిరములో ప్రత్యేక పూజలు చేసారు. గెలిచిన వెంటనే నల్లపోచమ్మకు 101 కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తిర్చుంటామని మక్కల సాయినాథ్ తెలిపారు. పురోహితులు ప్రత్యేక పూజలు చేసి అందించిన ప్రసాదాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి హెదరాబాదు లో ఉన్నందున మన ప్రియతమ నాయకులు, ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి ఏ.రాజేశ్వర్ రెడ్డి కీ అందచేసి ముందస్తు శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలోఎంపిపి పస్క నర్సయ్య, బిఆర్ఎస్ సీనియర్ లీడర్ మోత్కూరి లింగగౌడ్ గారు, భారత జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు నిరగొండ సాయిలు,
భారత జాగృతి ఆర్మూర్ టౌన్ అధ్యక్షులు దండుగుల నాయుడు,దొంకేశ్వర్ మండల అధ్యక్షులు పోగరి సంజీవ్, ఆర్మూర్ మండల అధ్యక్షులు నవీన్ యాదవ్,యూత్ నాయకులు వరికుప్పల బుమేష్,అల్లేపు రాకేష్,శరత్, నవీన్,సాయికుమార్,జాగృతి ముఖ్య నాయకులు జాగృతి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.