ఆర్మూర్(TELANGANA FOCUS) నవంబర్13: గౌతమ బుద్దుడు – సమ్రాట్ అశోక్ ల వల్లనే ప్రపంచంలో “భారతదేశాని” కి ఓ గొప్ప గుర్తింపు ఉంది. బుద్దుడు ప్రజల దుఖ నివారణకై ఇంటి నుంచి బయలుదేరి ఆరేళ్ల పాటు సంచరించి, జ్ఞ్యానోదయం పొందిన తర్వాత తొలిసారిగా తిరిగి తమ రాజగృహం నుంచి కపిలవస్తుకు వస్తున్న సందర్భంలో ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలకడానికి సంతోషంతో వీధులు నగరమంతా దీపాలు వెల్గించి అలంకరించారు. ఆ శుభ దినమే కార్తీక అమావాస్య రోజు. ఆ రోజుననే జగమంతా దీపావళి పండుగ. అశోకుడు బౌద్ధం స్వీకరించిన అనంతరం 84000వేల బౌద్ధ స్తూపాలను అశేష దీపాలతో ప్రారంభించిన రోజు కూడా కార్తీక అమావాస్య రోజు. ఇదే వారసత్వాన్ని ఆనాటి నుంచి దేశ-విదేశీ ప్రజలు నేటి వరకు విశ్వమంతా వేడుక రూపంలో పాటిస్తూ వస్తున్నారని ఆచార్య ధమ్మరక్షిత బోధించారు. ఆదివారం జిల్లా నిజామాబాద్ ఆర్మూర్ సిటీలోని బుద్ద పార్కులో “బౌద్ధ దీపావళి పండుగ” ను ఘనంగా జర్పారు. మార్గదర్శకులుగా ప్రఖ్యాత బౌద్ధబిక్షు బంతే ధమ్మరక్షిత హాజరై పై చరిత్రను ప్రజలకు వివరించారు. ఆరంభంలో మహిళలు తథాగతుడి చుట్టూ దీపాలు వెల్గించారు. త్రిశరణం పంచశీలాలను అలాపించారు. చివర్లో స్వీట్స్ వితరణ చేశారు. నిర్వాహకులైన ఉపాసకులు మూల్ నివాసి మాలజీ (ముంబై), ఇత్వార్ పేట్ లింగం, ముగా ప్రభాకర్, బి.హేమంత్ కుమార్, కంబా ప్రణిల్, వికాస్ పవార్, రాజు జాదవ్, కవిత కదం, కల్పన, సునీత కాంబ్లే, సమ్రాట్ అశోక్, అంగులి మాలజీ, మామిడి రాజు కృషి చేశారు.