Telugu Updates

దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకావాలి: ఆర్మూర్ ఎస్సై అశోక్ వెల్లడి.

Post top

దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకావాలి ఆర్మూర్ ఎస్సై అశోక్ వెల్లడి.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)నవంబర్11: గతంలో దీపావళి సందర్భంగా జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం బాణసంచా తయారుచేయు/విక్రయించే దుకాణా దారులు ఎవరైనా అనుమతి లేకుండా బాణ సంచా/టపాసులను ఇళ్లల్లో, షాపులలో, జన సముదాయాల మధ్య గోడౌన్‌లలో స్టాకు అనుమతి లేకుండా నిల్వలు చేసిన లేదా లైసెన్సు లేకుండా అనధికార విక్రయాలు జరిపిన , బాణాసంచా విక్రయించే దూకణదారులు పోలీసులు సూచించిన నియమ నిబంధనలను తప్పని సరిగా పాటించకపోయినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

అంతేకాకుండా స్టోరేజ్ గోడౌన్లు మరియు అమ్మకాలు జరిగే ప్రదేశాల పైన ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.

– DAIL 100

పట్టణంలో ఎక్కడైనా అక్రమంగా మందు గుండు సామాగ్రి తయారీ చేసిన, విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం ఉంటే ప్రజలు వెంటనే DAIL 100 కి గాని, పట్టణ పోలీసు స్టేషన్ లలోని ఎస్సైలకు గానీ సమాచారం అందించాలని సూచించారు.

బాణాసంచా విక్రయించే దూకణదారులు ఈ క్రింది నియమనిబంధనలను తప్పని సరిగా పాటించాలి:

◆ బాణాసంచా నిల్వచేసే కేంద్రాల నిర్వాహకులు, తయారీ చేసేవారు, విక్రయాలు చేసేవారు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి.
◆ బాణసంచా సామాగ్రి తయారీ, నిల్వ కేంద్రాలు ప్రజల నివాస ప్రాంతాలకు నిర్దిష్ట దూరంలో ఉండాలి.
◆ ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నింటినీ తప్పనిసరిగా పాటించాలన్నారు.
◆ పై వాటిలో విధులు నిర్వహించే వారికి అగ్ని ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.
◆ బాణాసంచా విక్రయ దుకాణాలను జనావాసాలకు, విద్యాసంస్థలకు, హాస్పిటల్స్ కు దూరంగా అధికారులు సూచించిన ప్రదేశంలోనే బాణాసంచా విక్రయాలు జరగాలన్నారు.
◆ బాణాసంచా విక్రయ దుకాణాల మధ్య కనీస నిర్దిష్ట దూరం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
◆ ప్రతీ దుకాణం వద్ద అగ్ని నిరోధక సిలెండర్లు, తగినంత పొడి ఇసుక, కావాల్సిన నీరు అందుబాటులో ఉండాలి.
◆ మైనర్లను బాణసంచా నిల్వచేసే కేంద్రాల వద్ద మరియు తయారీ లేదా విక్రయ పనుల్లో వారిని వినియోగించరాదు.
◆ లైసెన్స్ కలిగి ఉన్న విక్రయిదారులు లైసెన్స్ లేని వారికి విక్రయించి, తద్వారా ఏదైనా ప్రమాదం సంభవించినా, దానికి లైసెన్స్ దారులదే పూర్తి బాధ్యత వహించాలి.
◆ లైసెన్స్ కలిగిన విక్రయాదారులు తమ లైసెన్స్ ను దుకాణం వద్ద తప్పనిసరిగా అందరికీ కనిపించే విధముగా ఉంచాలి.
◆ అనుమతి పొందిన దుకాణదారులు అధికారులు సూచించిన సమయాల్లో మాత్రమే విక్రయాలు జరపాలి. ఆదే విధంగా దీపావళి రోజున రాత్రి ఎనిమిది గంటల తరువాత ఎటువంటి అమ్మకాలను జరపరాదని అధికారుల ఆదేశాల మేరకు పట్టణ ఎస్సై అశోక్ తెలిపారు

Post bottom

Leave A Reply

Your email address will not be published.