Telugu Updates

నేడు రెండవ నామినేషన్ దాఖలు వెయ్యనున్న కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి. -ముఖ్యఅతిథిగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శనిగరం సంతోష్ రెడ్డి

Post top

నేడు రెండవ నామినేషన్ దాఖలు వెయ్యనున్న కాంగ్రెస్ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) నవంబర్ 09:ఆర్మూర్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొద్దుటూరి వినయ్ రెడ్డి రెండోవ సెట్ నామినేషన్ దాఖలు శుక్రవారం ఉదయం 10 గంటలకు వెయ్యనున్నారు. ఆయనతో సీనియర్ నాయకులు ముఖ్యఅతిథిగా మాజీ మంత్రివర్యులు శనిగరం సంతోష్ రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తోపాటు పార్టీ ముఖ్య నేతల సమక్షంలో వినయ్ రెడ్డి రెండవ నామినేషన్ దాఖలు శుక్రవారం వెయ్యనున్నారు 

ఈ సందర్భంగా ప్రోద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..

ఒక్క అవకాశం ఇవ్వండి మీ ఓటుతో నన్నుఆశీర్వదిస్తే అభివృద్ధితో మీకు సేవ చేసి మీ రుణం తీర్చుకుంటాను

కమిషన్ల అవినీతితో కబ్జాలతో రాబందుల్లా ప్రజల ధనాన్ని దోచుకుంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం దుకాణం బంద్ అయ్యే సమయం ఆసన్నమైంది.

ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి రెచ్చగొట్టి మనలో మనకు కలహాలు పెట్టే వారి కి అవకాశం ఇవ్వకండి

బడుగు బలహీన వర్గాల ప్రజా సంక్షేమాల మన అందరి సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిజామాబాద్ పట్టణాన్ని సర్వహంగులతో రాష్ట్రంలోనే అభివృద్ధిలో మొదటి స్థానం లో ఉంచే బాధ్యత నాది

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే

సోనియాగాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీంలను అమలు చేసి మీ అందరికీ ఆదుకునే బాధ్యత నాది

కాంగ్రెస్ పార్టీ గెలవగానే మొదటిగా అమలు చేసే పథకాలు…

◆ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రూ.2500 పేద మహిళలకు
రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

◆ రైతు భరోసా కింద ఏటా రైతుకు రూ.15 వేలు కౌలు రైతులకు ఇది వర్తింపు. భూమి లేని నిరుపేదలు, కూలీలకు ఏటా రూ.12 వేలు.
వరి పండించే రైతులకు మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌.

◆ ఇంద్రమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం తో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు

◆ గృహ జ్యోతి పథకం కింద ఇంటి విద్యుత్ బిల్లు (కరెంట్ బిల్లు) 200 యూనిట్ల వరకు ఉచితం

◆ చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయల పెన్షన్. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు ఆరోగ్య భీమా

◆ యువ వికాసం పథకం కింద కళాశాల విద్యార్థులకు కోచింగ్ ఫీజుల కింద 5 లక్షల రూపాయల వరకు సహాయం

వీటితోపాటు మరెన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి అందించే లక్ష్యం కాంగ్రెస్ పార్టీదని కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి అన్నారు

ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యఅతిథిగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శనిగరం సంతోష్ రెడ్డి, మానాల మోహన్ రెడ్డి, వీరితోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వినయ్ రెడ్డి ప్రజలను కోరారు. పదవ తారీకు శుక్రవారం ఉదయం పెర్కిట్ చౌరస్తా నుండి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వస్తున్నారని ఇట్టి కార్యక్రమాన్ని నియోజకవర్గ ప్రజలు అభిమానులు పార్టీ కార్యకర్తలు శ్రేణులు నేతలు ముఖ్యంగా నియోజకవర్గంలో గ్రామ గ్రామాన అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని చేయగలరని కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి ప్రజలను కోరారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.