ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) నవంబర్09: నిజామాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆర్మూర్లో ర్యాలీగా నామినేషన్కు వెళ్తుండగా ప్రచారరథంపై నుంచి కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అదుపు తప్పి కిందపడ్డారు. ఆర్మూరు పట్టణంలోని పాత ఆలూరు రోడ్ వద్ద ఘటన జరిగింది. హుటాహుటిన నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.