ఆర్మూర్ బిసి బిడ్డ స్వతంత్ర అభ్యర్థిగా నారాయణపేట్ రాజేష్ నామినేషన్.
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)నవంబర్ 8: ఆర్మూర్ పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. పట్టణంలో భారీ ర్యాలీగా వచ్చి
పైడి రాకేష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆర్మూర్ పట్టణానికి చెందిన నారాయణపేట రాజేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, అదిలాబాద్ బిజెపి ఇన్చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పాల్గొన్నారు. తాసిల్దార్ కార్యాలయం వద్ద సీఐ సురేష్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.