ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన బిఆర్ఎస్ జిల్లా యూత్ సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి.

ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేసిన ప్రజలకు బిఆర్ఎస్ జిల్లా యూత్ సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు. ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)నవంబర్3: ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ లో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ కు రావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. ఆర్మూర్ ను ముంచెత్తిన జన సంద్రాన్ని చూసి ఇది జనమా .. గులాబీ వనమా అన్న భావన కలిగింది. ప్రజలతో సభాస్థలి కిక్కిరిసింది. ప్రజా ఆశీర్వాద సభకు ఊహించినదాని కన్నా రెట్టింపు వచ్చి విజయవంతం చేసిన ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులకు జిల్లా యూత్ సీనియర్ నాయకులు మల్యాల నర్సారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.