ఈ నెల 5న మాదిగల యుద్ధభేరి. -ఛలో ఇందిరాపార్కు -ఆర్మూర్ ఎమ్మార్పీఎస్ టీఎస్ ఇంచార్జ్ బచ్చపల్లి దేవయ్య పిలుపు..
నందిపేట్(తెలంగాణ ఫోకస్)నవంబర్02:
సామాజిక, ఆర్ధిక, రాజకీయ, న్యాయమైన వాటకై ఈ నెల 5న ఛలో ఇందిరాపార్కు తరలిరావాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి బచ్చపల్లి పెద్ద దేవయ్య కోరారు.రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు సామాజిక న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి బచ్చపల్లి పెద్ద దేవయ్య అన్నారు. మాదిగ -మాదిగ ఉప కులాలకు రాజకీయ పార్టీలన్నీ తమ వైఖరిని ప్రకటించే విధంగా మనం పోరాటాన్ని నిర్మించాలని, అదే విధంగా రాబోయే పార్లమెంట్ సమావేశాలలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశ పెట్టే విధంగా అన్ని రాజకీయ పక్షాలు అధికార బీజెపీ మీద ఒత్తిడి పెంచాలని ఎమ్మార్పీఎస్ టిఎస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి దేవయ్య నందిపేట్ మండల ముఖ్య నాయకులు సమావేశమై కరపత్రాలు విడుదల చేసి కోరారు మాదిగలు తెలంగాణ రాష్ట్రంలో మిగతా కులాల కంటే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. సామాజిక నిర్మాణంలో, ఉత్పత్తిలో వారి పాత్ర విస్మరించలేనిది. వేల సంవత్సరాలుగా విద్యకు, రాజ్యాధికారానికి, సంపదకు సామాజిక గౌరవానికి దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పులు కుట్టి, డప్పు కొట్టి సమాజానికి సేవ చేసే ఘనత మాదిగ మాదిగ-ఉప కులాలకే దక్కిందని గర్వంగా చెప్పారు. సామాజిక నిర్మాతలుగా, సేవకులుగా తమ బాధ్యతను నిర్వహించారని మరోసారి గుర్తు చేశారు. మాదిగ మాదిగ-ఉప కులాలకు అన్నింటిలో సముచిత గౌరవాన్ని ఇచ్చి సామాజిక న్యాయాన్ని అమలు చేసే బాధ్యతను అందరూ తీసుకోవాలి జాతీయ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల పిలుపుమేరకు నందిపేట్ మండల ఎస్సీ కాలనీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి బచ్చపల్లి పెద్ద దేవయ్య గారి అధ్యక్షతన నందిపేట్ మండలం ఎమ్మార్పీఎస్ టీఎస్ మండల అధ్యక్షులుగా ధూపల్లి గంగాధర్ ను నియమించినట్లు ప్రకటనలో నియోజకవర్గ ఇన్చార్జి దేవయ్య తెలిపారు. మాదిగ మాదిగ ఉపకులాల జాతులపై కేంద్ర ప్రభుత్వాన్ని నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు ఈనెల 5న గ్రామ గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధభేరి విజయవంతం చేయాలని దేవయ్య పిలుపునిచ్చారు.
ఇది ఇలా ఉండగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమంలో మాదిగలు, ముందు వరుసలో నిలబడ్డారు. కేసులు, నిర్భంధాలు, జైలు జీవితం అనుభవించారు. పోరాటంలో ఎందరో ఆత్మ బలిదానం చేసుకున్న విషయం తెలిసిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణంలో మన మాదిగ మాదిగ ఉపకులాల పాత్ర ఉండాలని ఎమ్మార్పీఎస్ టీఎస్ భావించిందని మరోసారి గుర్తు చేశారు. మేధావులు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ విప్లవవాదులు కూడా తెలంగాణ పునర్మిర్మాణానికి మద్దతుగా నిలబడ్డారని ఈ సమావేశంలో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ కూడా ఇదే భావనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సందర్భాలలో మద్దతుగా నిలబడిందని అన్నారు. ఈనెల 5న చలో ఇంద్రాపార్క్ కు గ్రామ గ్రామాల నుండి అధిక సంఖ్యలో పాల్గొని మాదిగల యుద్ధభేరి విజయవంతం చేయాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చపల్లి దేవయ్య మాదిగలను కోరారు.
ఈ కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మార్పీఎస్ టీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బచ్చపల్లి దేవయ్య తోపాటు నూతనంగా నందిపేట్ మండల ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షులుగా ఎన్నికైన దూపల్లి గంగాధర్, రాష్ట్ర మహిళా విభాగం పద్మక్క మచ్చర్ల దేవన్న సుజాత సువర్ణ గంగుబాయి తదితరులు పాల్గొన్నారు