పోటీ చేసే అభ్యర్థులపై దాడులను సహించేది లేదు -పల్లెటూరు ప్రసాద్. -స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం కన్వీనర్ పల్లెటూరు ప్రసాద్.
పోటీ చేసే అభ్యర్థులపై దాడులను సహించేది లేదు – పల్లెటూరు ప్రసాద్.
-స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం కన్వీనర్ పల్లెటూరు ప్రసాద్.
సిద్దిపేట/దుబ్బాక (తెలంగాణ ఫోకస్) అక్టోబర్30: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా దుబ్బాక నియోజకవర్గం నుంచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి పై సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కత్తితో దాడి చేసిన సంఘటన విచారకరమని తెలంగాణ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పల్లెటూరి ప్రసాద్ అన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో ఎన్నికలు సజావుగా జరిగేలా అభ్యర్థులు అధికారులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఏ రాజకీయ పార్టీ కూడా వ్యక్తిగత దూషణలు కానీ వ్యక్తిగత దాడులు కానీ చేయడం సమంజసం కాదని అన్నారు. ఏదైనా రాజకీయ విమర్శలు చేయాలనుకుంటే దానికి ప్రతి దాడులు చేయాల్సిన అవసరం కూడా లేదని భౌతికదారులకు దుబ్బాక నిలయం కాదని పేర్కొన్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దుబ్బాక నియోజకవర్గం లో రాజకీయ దాడులను పెంచి పోషిస్తున్న వారిపై ప్రభుత్వం పోలీస్ శాఖ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడింది ఎంతటి వారైనా దాడిలో భాగమైన వారిపై న్యాయ విచారణ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో ఏ అభ్యర్థిపై దాడి జరిగిన సహించేది లేదని అభ్యర్థులకు అవసరమైతే ప్రభుత్వం పోలీస్ శాఖ రక్షణ కల్పించాలని కోరారు.
సూరంపల్లి ఘటనపై రాజు రాజు దాడికి చేయడానికి గల కారణాలు వాటి వెనుక ఉన్న అంశాలను పోలీస్ శాఖ వేగవంతంగా విచారణ చేయాలని, గాయపడిన అభ్యర్థికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.