Telugu Updates

ఇది చేతల, చేనేతల ప్రభుత్వం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. -పద్మశాలీ సోదరులకు జీవితాంతం అండగా ఉంటా.

Post top

ఇది చేతల, చేనేతల ప్రభుత్వం. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

– పద్మశాలీ సోదరులకు జీవితాంతం అండగా ఉంటా.

– వారికేకష్టమొచ్చినా నా కష్టమనుకుంటా.

– చేనేతల బతుకు చిత్రం మార్చడం కోసమే బతుకమ్మ చీరెల పథకం.

– నాడు ‘ఉరి’ సిల్ల, నేడు ‘సిరి’సిల్ల.

– తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత చేనేతల జీవితాలకు వెలుగు.

– మీ కడుపులో తలపెట్టి అడుగుతున్న నన్ను మళ్లీ దీవించండి.
– పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి.

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్29:

ఇది చేతల, చేనేతల ప్రభుత్వం అని ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ‘ఆర్మూర్ మండల పద్మశాలి ఫంక్షన్ హాల్ లో
ఆదివారం జరిగిన పద్మశాలి సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మశాలీ సోదరులకు జీవితాంతం అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారికేకష్టమొచ్చినా నా కష్టమనుకుంటా.
చేనేతల బతుకు చిత్రం మార్చడం కోసమే బతుకమ్మ చీరెల పథకం. తెలంగాణ రాష్ట్రం రాక ముందు చేనేత అన్నల పరిస్థితి ఎట్లుంది?.నేడెట్లుంది,?. నాడు ‘ఉరి’ సిల్ల. గౌరవ మంత్రి కేటీఆర్ వచ్చాక నేడు ‘సిరి’సిల్ల. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలీ సోదరుల సంక్షేమం కోసం కట్టుబడి పని చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత చేనేతల జీవితాలకు వెలుగు వచ్చింది.
మీ కడుపులో తలపెట్టి అడుగుతున్న నన్ను మళ్లీ దీవించండి అని జీవన్ రెడ్డి అర్ధించారు.
ఆర్మూర్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి పాల్గొన్న పద్మశాలి సామాజిక వర్గం వారిని చూసి భావోద్రేకానికి లోనైన జీవన్ రెడ్డి దాదాపు 50 గ్రామాలకు చెందిన పద్మశాలి సంఘాలకు నిధులు మంజూరు చేశానని చెప్పినప్పుడు పద్మ శాలీలంతా కరతాళ్ల ధ్వనులు చేశారు.
ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ మండల పద్మశాలి ఫంక్షన్ హాల్ కు దాదాపు 10 కోట్ల రూపాయల విలువ గల ఎకరన్నర భూమి ఇవ్వడంతో పాటు ఒక కోటి రూపాయల నిధులు ఇచ్చానన్నారు.
నందిపేట్ మండల ఫంక్షన్ హాల్ కు రెండు ఎకరాల స్థలం కేటాయించి ఒక కోటి రూపాయల నిధులు మంజూరు చేశానని ఆయన తెలిపారు. తెలంగాణ వస్తే లాభం జరుగుతుందని నేతన్నలు నమ్మారు. కమిట్‌మెంట్‌తో ప్రభుత్వం పని చేస్తున్నది. మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో నేతన్నలు చితికి పోవద్దని సీఎం కేసీఆర్ ఆలోచనతో వస్త్రాలు కూడా కొనుగోలు చేస్తున్నాం. పద్మశాలీ సోదరులకు ఏ కష్టం రానివ్వం. ఇది మీ ప్రభుత్వం. దీనిని మళ్లీ నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీదే అని జీవన్ రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్.ఏం.బి రాజేశ్వర్, మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బొడ్డు గంగాధర్, ప్రధాన కార్యదర్శి బండారి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్గం హన్మాండ్లు, గోసికొండ అశోక్(ఈనాడు), ఈగ నాగభూషణ్(తెలంగాణ ఫోకస్), ఈరవత్రి రాజశేఖర్, అంబళ్ల శ్రీనివాస్, గుజ్జెటి రాము, దాసరి సునీల్, బిజ్జు దత్తాత్రి, పోతు నర్సయ్య, సీనియర్ పాత్రికేయులు కొమ్మన్ పల్లి రమణ, ఆర్మూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు, గ్రామాల, తర్పల అధ్యక్షులు, నాయకులు, ప్రతినిధులు, పెద్దసంఖ్యలో పద్మశాలి కులబాందవులు, మహిళామణులు పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.