Telugu Updates

వినండహో.. మన ఎమ్మెల్యేల ఆస్తులు ఇవేనట. -గత ఎన్నికల అఫిడవిట్లలో తేలిన లెక్క. -అత్యంత ధనవంతుడు బిగాల. -పేద ఎమ్మెల్యే షిండే. -ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించిన ఎడిఅర్. -వారి ఆస్తిపాస్తులు అంతంతేనట.

Post top

వినండహో… మన ఎమ్మెల్యేల ఆస్తులు ఇవేనట

గత ఎన్నికల అఫిడవిట్లలో తేలిన లెక్క

అత్యంత ధనవంతుడు బిగాల

పేద ఎమ్మెల్యే షిండే

ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించిన ఎడిఅర్

వారి ఆస్తిపాస్తులు అంతంతేనట

మనిషి ఏ వ్యాపారం చేసిన ఏ దందా చేసిన సంపాదన కోసమే కదా. అలాగే సంపాదన సంగతి ఎలా ఉన్న ఇప్పుడు ఎన్నికలు అంటే చాలు, కోట్ల రూపాయాలతో కూడుకున్న పరిస్థితి. సామాన్యుడు ఎన్నికల పేరు ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఒకరకంగా చెప్పలంటే వార్డు మెంబర్ గా పోటీ చేయాలన్నా లక్షల రూపాయాల ఖర్చు అవుతుంది. దీంతో సామాన్యుడు ఎన్నికలకు పూర్తి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికల జాతర మొదలైంది. మరోసారి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలలో త్రిముఖ పోరుకు సిద్ధం అయ్యారు. అధికార పార్టీ అభ్యర్థులు అయితే ఇప్పటికే సర్వం సిద్ధం చేసుకొని సై అంటే సై అంటున్నారు. ఇక కాంగ్రెస్, బిజెపిలు మొదటి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. జాబితాలు పూర్తి స్థాయిలో బయటకు వస్తే ఎన్నికల జోరు మొదలు అవుతుంది. మద్యం, బిర్యానీ, డబ్బు, బహుమతులు, దావత్తులు ఏరులై పారుతాయి. ఇది అందరికి తెలిసిందే. అయితే గత ఎన్నికలలో (2018)లో మన ఎమ్మెల్యేలు వారి అస్తిపాస్తుల వివరాలను ఎన్నికల కమిషన్ కు తెలిపారు. ఈ వివరాలను ఈ రోజు అసోషియేషన్ ఆఫ్ డెమెక్రటిక్ రిఫామ్స్ (ఎడిఆర్) సేకరించి ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తిపాస్తులతో పాటు వారిపై ఉన్న కేసులు, సందర్భాలు వివరిస్తు ఓ నోట్ ను విడుదల చేసారు. వారు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని మన ఎమ్మెల్యేల అస్తులు, సంపద వివరాలు ఇలా ఉన్నాయి.

టాప్ లో బిగాల, షకీల్….

గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ కు అభ్యర్థులు వివరించిన వివరాల ప్రకారం రాష్ట్రంలోనే మన ఎమ్మెల్యేలు కీలక స్థానంలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల స్థిర, చర ఆస్తులు ఇలా ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో తీసుకుంటే 118 స్థానాలలో
14వ స్థానంలో రూ.29.70 కోట్లతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ముందుంజలో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఆస్తి కలిగిన ఎమ్మెల్యేగా ముందు నిలిచారు. రాష్ట్రంలో 26వ స్థానంలో బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమేర్ రూ.18.92 కోట్లతో ఉమ్మడి జిల్లాలో రెండో స్థానంలో నిలిచారు. జిల్లాలో మూడో స్థానంలో, రాష్ట్రంలో 43వ స్థానంలో రూ.10.24 కోట్లతో బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి ప్రశాంత్ రెడ్డి నిలిచారు. జిల్లాలో నాలుగవ స్థానంలో, రాష్ట్రంలో 54వ స్థానంలో రూ.6.46 కోట్లతో ఆర్మూర్ ఎమ్మెల్యే, బిఅర్ఎన్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఉన్నారు. జిల్లా అయిదవ స్థానంలో రాష్ట్రంలో 60వ స్థానంలో రూ.5.38 కోట్లతో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిలిచారు. ఆరవ స్థానంలో, రాష్ట్రంలో 64వ స్థానంలో రూ.4.95 కోట్లతో బాన్సువాడ ఎమ్మెల్యే, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. జిల్లాలో ఏడవ స్థానంలో, రాష్ట్రంలో 77వ స్థానంలో రూ.3.40 కోట్లతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే బాజుల నురేందర్ ఉండగా ఎనిమిదవ స్థానంలో స్టేట్లో 90వ స్థానంలో రూ.2.12 కోట్లతో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో తోమ్మిదవ స్థానంలో, స్టేట్లో 101 స్థానంలో జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత షిండే నిలిచారు. స్వయంగా ఈ అస్తిపాస్తుల వివరాలను ఎమ్మెల్యేలే గత ఎన్నికల అఫిడవిల్లో ఎన్నికల కమిషన్ కు వివరించారు. ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన వివరాలను సేకరించిన ఎడిఆర్ సంస్థ వివరాలను మీడియా ముందు పెట్టారు.

అత్యంత ధనవంతుడు బిగాల…

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తోమ్మిది నియోజక వర్గాలలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా రూ.29.70 కోట్లతో అత్యంత ధనవంతుడిగా ముందు వరుసలో ఉన్నారు. రెండో స్థానంలో రూ.18.92 కోట్లతో షకిల్ అమీర్, మూడో స్థానంలో వేముల ప్రశాంత్ రెడ్డి, నాలుగో స్థానంలో ఆశన్నగారి జీవన్ రెడ్డి నిలిచారు. కానీ ఆర్మూర్, బాన్సువాడ నుంచి ఒకోసారి, నిజామాబాద్ రూరల్ నుంచి రెండు సార్లు మొత్తం నాలుగు సార్లు గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్ అయిదో స్థానంలో ఉన్నారు. ఏడు సార్లు గెలిచి పలుమార్లు మంత్రిగా, ప్రస్తుతం స్పీకర్ పని చేస్తున్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ.4.95 కోట్లతో జిల్లాలో ఆరవ స్థానంలో ఉ న్నారు. అలాగే జాజుల సురేందర్ గత ఎన్నికల్లో ఒక్కసారి గెలిచిన నాటికి రూ.3.40 కోట్లతో ఏడవ స్థానంలో, మూడు సార్లు గెలిచిన గంప గోవర్ధన్ ఎనిమిదవ స్థానంలో రూ.2.12 కోట్ల అస్తితో ఉన్నారు. అత్యంత పేద ఎమ్మెల్యేగా రూ.1.13 కోట్లతో జుక్కల్ హన్మంతుషిండే ఉండటం విశేషం.

ఆస్తుల వివరాలు రూ..లలో….

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేల వరుసగా చరస్తులు, స్థిర ఆస్తులు, వాటిని కలిపిన మొత్తం ఆస్తుల వివరాలు ఇవి.

బిగాల గణేష్ గుప్తా – 5,37,24,874 -24,32,60,923 =29,69,85,797

షకీల్ అమీర్ -9.24,96,539 -9,66,59,000 = 18,91,55,539

వేముల ప్రశాంత్ రెడ్డి-3,21,45,697 -7,02,75,212 =10,24,20,909

ఆశన్నగారి జీవన్రెడ్డి-1,84,26,504-4,62,16,000 =6,46,42.504

బాజిరెడ్డి గోవర్ధన్ – 98,08,877 – 4,40,00,000 = 5,38,08,877

పోచారం శ్రీనివాస్ రెడ్డి- 38,11,880 – 4,56,55,728 =4,94,67,608

జాజుల సురేందర్ – 1,05,38,547 – 2,34,81.250 = 3,40,19,797

గంప గోవర్ధన్ – 89,57,989 – 1,22,25,000 = 2,11,82,989

హన్మంతు షిండే- 42,01,689 – 70,66,000 = 1,12,67,689

అయిదేళ్లలో పెరిగింది ఎంతో మరి…

ఈసారి వీరందరికి బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టికెట్లు ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల ఆఫిడవిట్లో అస్తిపాస్తుల వివరాలు ఎంత వరకు పెంచుకున్నారో ఎన్నికల కమిషనకు చూపిస్తారు కదా. ఎమ్మెల్యేల సంపాదన ఎలా దో చూద్దాం మరి. జస్ట్ వేయిట్ అండ్ సీ…

కొనమెరుపు :- ఉమ్మడి జిల్లాలో ఏ ఎమ్మెల్యే మీద ఎన్ని కేసులు ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటి అనేది తరువాయి భాగంలో చూద్దాం.

Post bottom

Leave A Reply

Your email address will not be published.