Telugu Updates

క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ మాడవేడి సుధాకర్ మలేషియాలోని INTI అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సందర్శక పరిశోధకు ఎంపిక.

Post top

ప్రొఫెసర్ డాక్టర్ మాడవేడి సుధాకర్ మలేషియాలోని INTI అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సందర్శక పరిశోధకు ఎంపిక.

ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్)అక్టోబర్16: ఆర్మూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల ఎంబీఏ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాడవేడి సుధాకర్ మలేషియాలోని ఐ ఎన్ టి ఐ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో సందర్శక పరిశోధక కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఆయన అక్టోబర్29 నుండి నవంబర్ 07 వ తేదీ వరకు మలేషిలోని ఐ ఎన్ టి ఐ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే వివిధ సంక్షిప్త పరిశోధన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ విశ్వవిద్యాలయం (క్యూ.ఎస్) ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్లలో 500-600 బ్యాండ్ లో నిలిచింది. ఈ సందర్భంగా ఆయన భారత్ లో డిజిటల్ పేమెంట్లలో ప్రపంచంలో నే అభివృద్ధి చెందిన దేశాలకంటే ముందున్న తీరు,కరోన నియంత్రణలో భారత్ అవలభించిన పద్ధతులు, వ్యాక్సిన్ ని ప్రపంచ దేశాలకు అందించిన విధానం, గత రెండు దశబ్దాల్లో రిటైల్ రంగంలో వస్తున్న మార్పులను మరియు వాటిలో ఇమిడి ఉన్న మేనేజ్మెంట్ సబ్జెక్ట్ అంశాలను అక్కడి మేనేజ్మెంట్ పరిశోధన విద్యార్థులకు వివరించనున్నారు. వీటితో పాటు ఐఎన్టిఐ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే వివిధ కాన్ఫరెన్స్ లు, వర్కుషాప్, గెస్ట్ లెక్చర్లలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా పరిశోధకులు నూతన పరిశోధన విధానాలను, అంతర్జాతీయంగా మేనేజ్మెంట్ పరిశోధన గురించి పరస్పరం అవగాహన,విషయ మార్పిడికి వీలు కలుగుతుంది.
ఈ కార్యక్రమానికి ఎంపికైన డాక్టర్ మాడవేడి సుధాకర్ ను చైర్మన్ అల్జపూర్ శ్రీనివాస్, సెక్రెటరీ అల్జపూర్ దేవేందర్, ప్రిన్సిపాల్ డా.ఆర్కే పాండే, ఎంబీఏ డిపార్ట్మెంట్ స్టాఫ్ అభినందించారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.