Telugu Updates

అభివృద్ధిని చూసి ఓటేయండి. -బాగుపడని ఊరు లేదు..సంక్షేమం అందని ఇల్లు లేదు. “ప్రజాఆశీర్వాద యాత్ర”లో -ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

Post top

అభివృద్ధిని చూసి ఓటేయండి.. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.

– ఆర్మూర్ నియోజకవర్గ ప్రగతి నా పనితీరుకు గీటురాయి
– బాగుపడని ఊరు లేదు..సంక్షేమం అందని ఇల్లు లేదు.
– అభివృద్ధి ముందుకు పోవాలంటే మళ్లీ నన్నే గెలిపించండి.
– జీవితాంతం మీ కోసం జీతగాడిలా పనిచేస్తా.
– బీఆర్ఎస్ మేనిఫెస్టో బంగారు భవిష్యత్తు కు బాట
– ‘నమస్తే నవనాథపురం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.
– సుర్బీర్యాల్ గ్రామంలో “ప్రజాఆశీర్వాద యాత్ర”
– పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం
– ప్రజలకు గ్రామ ప్రగతి నివేదన.

ఆర్మూర్ (తెలంగాణ ఫోకస్)అక్టోబర్16:“ఈ పదేళ్ళలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి. ఆర్మూర్ నియోజక వర్గ ప్రగతి నా పనితీరుకు గీటురాయి. బాగుపడని ఊరు లేదు..సంక్షేమం అందని ఇల్లు లేదు. ఈ అభివృద్ధి ముందుకు పోవాలంటే మళ్లీ నన్నే గెలిపించండి. జీవితాంతం మీ కోసం జీతగాడిలా పనిచేస్తా” అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు.
నమస్తే నవనాథ పురం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలంలోని సుర్బీర్యాల్ గ్రామంలో “ప్రజాశీర్వాద యాత్ర” నిర్వహించారు. ఆయన సుర్బీర్యాల్ పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి గ్రామంలోకి అడుగు పెట్టిన జీవన్ రెడ్డికి ప్రజలు డప్పు వాయిద్యాలు, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు. మహిళలు బోనాలతో తమ అభిమాన నేతకు బ్రహ్మ రథం పట్టారు. పూలమాలలు, శాలువాలతో గ్రామస్తులు, పలు కుల సంఘాలు, ప్రజా సంఘాల పెద్దలు జీవన్ రెడ్డిని సత్కరించారు.
“జై జీవనన్న, జైజై కేసీఆర్, జై తెలంగాణ”, ఆర్మూర్ గడ్డ జీవనన్న అడ్డా” అన్న నినాదాలతో సుర్బీర్యాల్ గ్రామం మారుమోగింది. ఆయన ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ప్రజల యోగ క్షేమాలను అడిగి తెలుసు కున్నారు. పలు
సమస్యలను ఆయన అక్కడికక్కడే పరిష్కరించారు. గడపగడపకూ తిరిగి మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ గ్రామంలో జీవన్ రెడ్డి పెద్ద ఎత్తున నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అనంతరం జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాను ఈ పదేండ్లలో మీ గ్రామాల అభివృద్ధికి ఏ చేశానో చెప్పడం బాధ్యతగా భావించి మీవద్దకు వచ్చానన్నారు. నేను సుర్బీర్యాల్ వచ్చే సమయంలో
మీ గ్రామానికి చెందిన కొందరు వికలాంగులు నన్ను ఆపి ఎక్కడికి పోతున్నారు సార్ అని అడిగిన్రు. మీ ఊరికే పోయి నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి మూడోసారి కూడా నాకే ఓటేయమని అర్ధించడానికి వెళుతున్న అని చెప్పా. ఎందుకు సారు మీకనవసర శ్రమ. కేసీఆర్ మా వికలాంగుల పట్ల దేవుడు. మొన్ననే మా పెన్షన్లను రూ. 4016కు పెంచి మళ్లీ ఇప్పుడు రూ.6016 కు పెంచుతామని మాట ఇచ్చిన మహానేత కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాపై ఉంది. ఆర్మూరు నియోజకవర్గంలో 6వేలమంది వికలాంగులం ఉన్నాం. మేమే ఇంటింటికీ తిరిగి ఒక్కొక్కలం 15 ఓట్ల చొప్పున వేయించి మిమ్మల్ని70వేల ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటామని చెప్పిన్రు. ఈ గ్రామంలో మృతి చెందిన అబ్బా చిన్న ముత్తన్న, సట్ల పెల్లి లక్ష్మయ్య, లింగంపల్లి రాజలింగం, దామ ప్రభాకర్, పీసురాంరెడ్డి కుటుంబాలకు చెందిన వారితో నేను మాట్లాడా. చనిపోయిన వారిని ఎవరూ తీసుకురాలేరు కానీ కేసీఆర్ సారు మాత్రం రూ.5లక్షల చొప్పున తమ కుటుంబాలకు జీవిత బీమా పరిహారం ఇచ్చి ఆదుకున్నారు. మేమే కాదు మిగిలిన వారికి కూడా చెప్పి బీఆర్ఎస్ కే ఓట్లు వేయిస్తామన్నారు.
అయినా నేను పోయి చేసిన ప్రగతి గురించి మా అక్కలు చెల్లెళ్లకు, మా అన్నలకు, తమ్ముళ్లకు చెప్పి వారి కడుపులో తలపెట్టు దీవించండి అని వేడుకోవడానికి మీ దగ్గరకొచ్చా అని జీవన్ రెడ్డి చెప్పారు.
సుర్బిర్యాల్ గ్రామపంచాయతీలో 535 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. వృద్ధాప్య పింఛన్లు 147,వితంతు పింఛన్లు 111, వికలాంగుల పింఛన్లు 11, గీత కార్మికుల పింఛన్లు3, ఒంటరి మహిళల పింఛన్లు 23, బీడీ కార్మికుల పింఛన్లు 220, కలుపుకొని నెలకు రూ.2016, రూ. 4016 చొప్పున ఈ గ్రామానికి ఇప్పటివరకు రూ.10.57 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన 507 మంది రైతులకు ఇప్పటివరకు రైతుబంధు పథకం ద్వారా రూ. 63.87 కోట్లు వారి బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గ్రామంలో వివిధ కారణాల చేత మృతి చెందిన ఐదుగురు రైతులకు రూ.25 లక్షల రైతు బీమా పరిహారం అందింది.
ఈ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న 178 మంది బాధితులకు మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.46. 02 లక్షలు ఆర్థిక సాయం అందించాం. కల్యాణ లక్ష్మి ద్వారా రూ.87.81 లక్షలతో 93 మంది, షాదీ ముబారక్ ద్వారా రూ.15.87 లక్షలతో 17 మంది పేద ఇంటి ఆడపిల్లల పెళ్లిళ్లు జరిపించాం. రూ. 9.11 కోట్లతో మిషన్ భగీరథ ద్వారా ఈ గ్రామంలోని 650 ఇండ్లకు స్వచ్ఛమైన తాగునీటి సరఫరా చేస్తున్నాం. రూ. 24. 89 లక్షలతో 280 కే ఎల్ సామర్థ్యం కలిగిన నాలుగు మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు నిర్మించాం. ఈ గ్రామంలోని 51 మహిళా గ్రూపులకు రూ.24.89 లక్షల వడ్డీ లేని రుణాన్ని అందించాం. ఈ గ్రామంలోని 1256 మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాం. ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిలో ఉచితంగా డెలివరీ అయిన ఈ గ్రామానికి చెందిన 72 మంది తల్లులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేశాం. ఈ గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణానికి రూ.53 లక్షలు, సుర్బీర్యాల్ లిఫ్ట్ కు రూ.1.49 కోట్లు, కోమనపల్లి నుంచి చిట్టాపూర్ వయా సుర్బీర్యాల్ వరకు రూ.11 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టాం.
ఖానాపూర్ నుంచి సుర్బీర్యాల్ వరకు రూ. 1.32 కోట్లు ఖర్చు చేసి రోడ్డు నిర్మించాం. వీడీసీ భవన నిర్మాణానికి రూ.5లక్షలు, మహిళా భవనం నిర్మాణానికి రూ.7 లక్షలు, లక్ష్మీ నరసింహ స్వామి గుడి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.2 లక్షలు, యానం దగ్గర లక్ష్మీ నరసింహ స్వామి గుడి కాంపౌండ్ వాల్ కు రూ.3 లక్షలు, యాదవ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షలు, రజక సంఘం కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.5లక్షలు, రేణుక ఎల్లమ్మ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, అంబేద్కర్ మాల సంఘం దగ్గర షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎస్టీ నాయక పోడు సంఘ భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5 లక్షలు, వడ్డెర సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, అరుంధతి యువజన సంఘం షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, అవుసలి కమ్యూనిటీ హాలుకు రూ.5 లక్షలు, కుమ్మరి సంఘం భవనానికి రూ.5లక్షలు, ఇందిరమ్మ కాలనీలో మహిళా భవనం నిర్మాణానికి రూ.5 లక్షలు, గురడి కాపు సంఘాల షెడ్ల నిర్మాణానికి రూ.14 లక్షలు, ఎస్సీ మాల కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తుకు రూ.3 లక్షలు, గోసంగి కమ్యూనిటీ హాల్ కు రూ.4లక్షలు, అంబేద్కర్ విగ్రహం పక్కన ఐమాక్స్ లైట్స్ ఏర్పాటుకు రూ.1.38 లక్షలు, సుర్బీర్యాల్ కమ్యూనిటీ హాల్ కు రూ.3 లక్షలు, నాయక పోడు సంఘం భవనం మొదటి అంతస్తు షెడ్డుకు రూ.2 లక్షలు, మలవాడ సంఘం మొదటి అంతస్తుకు రూ.2 లక్షలు, మాదిగ కమ్యూనిటీ హాల్ కు రూ.5లక్షలు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరు చేసాం. ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ కొనుగోలుకు రూ.9 లక్షలు, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రూ.2.50 లక్షలు, వైకుంఠధామం నిర్మాణానికి రూ.10.30 లక్షలు, నర్సరీ నిర్మాణానికి ఒక లక్ష రూపాయలను మంజూరు చేసాం.సుర్బీర్యాల్ గ్రామపంచాయతీకి ఇప్పటివరకు రూ.39.37 కోట్ల అభివృద్ధి నిధులు వచ్చాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామ ప్రగతి నివేదికను ప్రజల ముందు ఉంచారు.
“బీఆర్ఎస్ మేనిఫెస్టో బంగారు భవిష్యత్తు కు బాట. పేద ప్రజలకు ఒక వరం.
కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష.
కాంగ్రెస్, బీజేపీ మాటలు నమ్మితే ఆగమవుతాం. మళ్లీ బీఆర్ఎస్ గెలవడం చారిత్రిక అవసరం. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం తెలంగాణ ద్రోహులకు చెంప పెట్టు” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.