Telugu Updates

వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలో పాల్గొన్న సీఎం కేసీఆర్.

Post top

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్13: దివంగత రైతు నాయకులు వేముల సురేందర్ రెడ్డి సతీమణి, రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి గురువారం హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం వేముల మంజులమ్మ అంత్యక్రియలకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. హెలికాప్టర్ లో వేల్పూర్ వచ్చిన సీఎం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. వేముల తల్లి మంజులమ్మ పార్థివ దేహం పై సీఎం కేసీఆర్ పుష్పగుచ్చం తో నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆయన సోదరుడు వేముల అజయ్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ధైర్యంగా ఉండాలని వారికి మనో ధైర్యాన్ని ఇచ్చారు. రాష్ట్ర మంత్రి వేముల మాతృమూర్తి అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ,సీఎం తనయ, ఇందూరు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్యేలు ఆశన్న గారి జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, షకీల్ హైమద్, బాజి రెడ్డి గోవర్ధన్, ఇందూరు డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ చైర్మన్ డాక్టర్ మధుశేఖర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, వేముల బంధువులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.