Telugu Updates

కాంగ్రెస్ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం. ఆర్మూర్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయం అంటున్న స్థానికులు..

Post top

ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్11 కాంగ్రెస్ పార్టీ గడప గడపకు కార్యక్రమంలో బాగంగా బుధవారం సాయంత్రం పాత బస్టాండ్ సెంటర్లో,పంత్ రోడ్ లో షాప్స్,కూరగాయల మార్కెట్ లో ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు.
— కాంగ్రెస్ పార్టీ ఈస్తున్నా 6 పథకాల గూర్చి ప్రతి ఒక్కరికీ వివరిస్తున్నారు. ఆర్మూర్ లో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుంది అని,గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇస్తుందని వారికి తెలియజేస్తున్నారు.ప్రతి ఇంటికి గృహా జ్యోతి కింద 200 యూనిట్లు ఉచితంగా కరేంట్ ని అందిస్తున్నారు .ఇల్లు లేని వారికి ఇంటి స్థలం మరియు 5 లక్షలు ఇస్తున్నరు అంతే కాకుండా రైతు బరోసా కింద ప్రతి సంవత్సరం కౌలు రైతులకు 15000 రూపాయలు అలాగే వ్యవసాయ కూలీలకు 12000 రూపాయలు అంతే కాకుండా బోనస్ కింద 500 రూపాయిలు అందిస్తున్నారు.యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తుందన్నారు.అంతే కాకుండా చేయూత కింద 4000 నెలవారీ పింఛన్ 10 లక్షల రూపాయల రాజు ఆరోగ్యశ్రీ బీమా అందజేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గెలుస్తుందని మీ ఓటుతో ఈసారి టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలన్నారు. గత రెండు పర్యాయాలు టిఆర్ఎస్ ఓటు వేసి నందుకు ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.