ఆర్మూర్(తెలంగాణ ఫోకస్) అక్టోబర్11: క్షత్రియ విద్యార్థులు (పూర్వ ప్రాథమిక) ఆర్మూర్ పట్టణములో క్షేత్ర స్థాయి పరిశీలన నిమిత్తం వివిద ప్రభుత్వ కార్యాలయాలను కుల వృత్తుల వ్యవస్థను సందర్శించినారు. ఇందులో భాగంగా విద్యార్థులు పోస్టాఫీసు, ప్రభుత్వ ఆస్పత్రి, రైతుబజార్, పోలిస్ స్టేషన్ లను సందర్శించి అక్కడ జరిగే కార్యాకలాపాలను తెలుసుకున్నారు. అదే విధంగా వివిధ కుల వృత్తులను నిర్వర్తిస్తున్న వడ్రంగి, కుమ్మరి, అవుసలి, క్షురకుడు మొదలైన వ్యక్తులను, వారి వృత్తి నైపుణ్యాలను, గమనించినారు. ఈ సందర్భంగా క్షత్రియ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మాట్లాడుతూ.. ఈ క్షేత్ర పర్యటన ద్వారా సమాజంలో అందరికీ అందుబాటులో ఉండే ఉద్యోగులు,కులవృత్తుల వారు, వారందరి వృత్తి వివరాలను చూసి తెలుసుకోవడం ద్వారా విద్యార్థులకు అనుభవపూర్వకంగా ప్రత్యక్ష అవగాహన ఏర్పడుతుందని ఆన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సరీ, ఎల్.కె.జి మరియు యు.కె.జి విద్యార్థినీ, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Related Posts