ఎలెక్షనొచ్చింది.. ఇక సెలెక్షన్ మీదే. -బీఆర్ఎస్ అభివృద్ధి కావాలా, కాంగ్రెస్ దుర్బుద్ధి కావాలా?-ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, దేవతలు.. -మీ చల్లని ఆశీస్సులతో మళ్లీ గెలుస్తా. -బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ విజయం.

ఎలెక్షనొచ్చింది.. ఇక సెలెక్షన్ మీదే
-బీఆర్ఎస్ అభివృద్ధి కావాలా, కాంగ్రెస్ దుర్బుద్ధి కావాలా?
-కేసీఆర్ సంక్షేమం కావాలా, కాంగ్రెస్ సంక్షోభం కావాలా?
-సంపద పెంచి పేదలకు పంచే కేసీఆర్ కావాలా?
-ప్రజల సొమ్ము దోచుకొని దాచుకునే అవినీతి కాంగ్రెస్ కావాలా?
-“కారు”కు ఓటేస్తే సంక్షేమ సంబురం
-భస్మాసుర హస్తాన్ని నమ్మితే మాడి మసికావడమే
-ఏ గట్టునుంటారో మీరే నిర్ణయించుకోండి
– నందిపేట్ మండలం నా ఆత్మీయ బంధుగణం
-నేను సకల కులాలు నచ్చిన, మెచ్చిన మీ బిడ్డను
-మీ కోసం జీతగాడిలా పనిచేస్తున్నా
-ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, దేవతలు
-మీ చల్లని ఆశీస్సులతో మళ్లీ గెలుస్తా
-బీఆర్ఎస్ అంటేనే బడుగులు, రైతుల సంక్షేమం
-మనసున్న మహారాజు కేసీఆర్
-ఆయన మూడోసారి ముఖ్యమంత్రి కావాలి
-బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ విజయం
-కాంగ్రెస్, బీజేపీలకు మళ్లీ శృంగభంగమే
-ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు?
-“నమస్తే నవనాథపురం” కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-కుద్వాన్ పూర్ గ్రామంలో ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’
-పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
నందిపేట్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్9:
ఎలెక్షన్ నగారా మోగింది. ఇక ఎవరిని గెలిపించాలో సెలెక్షన్ మీదే. బీఆర్ఎస్ అభివృద్ధి కావాలా?. కాంగ్రెస్ దుర్బుద్ధి కావాలా?. కేసీఆర్ సంక్షేమం కావాలా?. కాంగ్రెస్ సంక్షోభం కావాలా?. సంపద పెంచి పేదలకు పంచే కేసీఆర్ కావాలా?.
ప్రజల సొమ్ము దోచుకొని దాచుకునే అవినీతి కాంగ్రెస్ కావాలా?. “కారు”కు ఓటేస్తే సంక్షేమ సంబురం. కాంగ్రెస్భస్మాసుర హస్తాన్ని నమ్మితే మాడి మసికావడమే.
ఏ గట్టునుంటారో మీరే నిర్ణయించుకోండి అని పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. “నమస్తే నవనాథపురం” కార్యక్రమంలో భాగంగా సోమవారం జీవన్ రెడ్డి నందిపేట్ మండలం కుద్వాన్ పూర్ గ్రామంలో ‘ప్రజా ఆశీర్వాద యాత్ర’ లో పాల్గొని బీఆర్ఎస్ ప్రభుత్వం,గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కుద్వాన్ పూర్ లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి కుద్వాన్ పూర్ చేరుకున్న జీవన్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్థానిక ప్రజలు , వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులు, ముఖ్యంగా యువకులు, మహిళలు మేళ తాళ్లాలతో జీవన్ రెడ్డి కి బ్రహ్మరథం పట్టారు. మహిళలు బోనాలతో ప్రదర్శన ముందు వరుసలో నడవగా యువకులు బాణ సంచా కాలుస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కుద్వాన్ పూర్ గ్రామ పెద్దలు పూలమాలలు, శాలువాలతో జీవన్ రెడ్డిని సన్మానించారు.
“జై జీవనన్న, జైజై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్ , జై తెలంగాణ” వంటి నినాదాలతో కుద్వాన్ పూర్ మారుమోగింది. జీవన్ రెడ్డి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రజలను పలకరించారు. ప్రతీ ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి మంచీ చెడుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. స్థానికంగా ప్రజలు తన దృష్టికి తెచ్చిన అనేక సమస్యలను ఆయన అక్కడిక్కడే పరిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ
నందిపేట్ మండల ప్రజలంతా నా ఆత్మీయ బంధుగణమన్నారు.
“నేను సకల కులాలు నచ్చిన, మెచ్చిన మీ బిడ్డను. మీ కోసం జీతగాడిలా పనిచేస్తున్నా.ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలే నా దేవుళ్ళు, దేవతలు. మీ చల్లని ఆశీస్సులతో మళ్లీ గెలుస్తా.
బీఆర్ఎస్ అంటేనే బడుగులు, రైతుల సంక్షేమం. మనసున్న మహారాజు కేసీఆర్.
ఆయన మూడోసారి ముఖ్యమంత్రి కావాలి. బీఆర్ఎస్ దే హ్యాట్రిక్ విజయం.
కాంగ్రెస్, బీజేపీలకు మళ్లీ శృంగభంగమే.
ఇక్కడ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వారు పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదు?. కాంగ్రెస్ కట్టు కథలు, బోగస్ హామీలు నమ్మితే మనం మరోసారి మోసపోతాం” అని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
తెలంగాణ వస్తే ఏమొస్తది అని అవహేళన చేసిన వారికి ప్రజల్లో కనిపిస్తున్న సంతోషమే సమాధానమన్నారు.అభివృద్ధిని చూడండి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా పాలిస్తున్న బీజేపీ ఒక్క రోజన్నా ప్రజలను పట్టించుకుందా?కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికలప్పుడే కనిపించే పగటి వేషగాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మితే ఆగమవుతామన్నారు.
ప్రగతి వెల్లివిరుస్తున్న ఆర్మూర్ నియోజక వర్గం అభివృద్ధి, సంక్షేమానికి అసలు సిసలైన అడ్రస్ గా మారిందన్నారు.
కేసీఆర్ సకల జనుల ఆత్మబంధువు అని, ఆయన చేతికి ఎముక లేదని, ప్రతీ ఒక్కరికి సాయం చేయడం ఆయనకు దేవుడిచ్చిన వరమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
“నేను నందిపేట్ కు వచ్చే సమయంలో మార్గమధ్యంలో ఈ గ్రామానికి చెందిన
షేక్ సాకీర్ ఇమామ్ నిషాద్, ఎనుగంటి మానస దొంతుల నరసయ్య, సాదుల సాయన్న, గొల్లపల్లి అరుణ మర్రిపల్లి యోగేశ్వర్
తదితర వికలాంగులు నన్ను కలిసి మీరు తిరగాలిసిన పనిలేదు.మన ప్రభుత్వం, మన కేసీఆర్, మీరు పని చేసే యంత్రాలు. మా తల్లి తండ్రుల కన్నా ఎక్కువగా మాకు అండగా నిలిచిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత మాది. మాకు రూ.4,016 చొప్పున పెన్షన్లు ఇస్తున్న బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గంలోని మొత్తం 5వేల మంది వికలాంగులం మాకుటుంబ సభ్యులతో కలిసి ప్రచారం చేస్తామని చెప్పిండ్రు. ఇలా సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతీ ఒక్కరూ కేసీఆర్ మూడోసారి సీఎం కావాలని, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నారు అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. అయినా నేను ఈ పదేళ్ళలో ఈ గ్రామానికి ఏం చేశానో చెప్పి మీ కడుపులో తలపెట్టి నన్ను మళ్లీ దీవించాలని అడగడానికి వచ్చా. కుద్వాన్ పూర్ గ్రామపంచాయతీలో 974 మందికి ఆసరా పెన్షన్లు వస్తున్నాయి. వృద్ధాప్య పింఛన్లు 221, వితంతు పింఛన్లు 238, వికలాంగుల పింఛన్లు 43, కల్లుగీత కార్మికుల పింఛన్లు 2, ఒంటరి మహిళల పింఛన్లు 20, బీడీ కార్మికుల పింఛన్లు 450, కలుపుకొని మొత్తం 974 మందికి రూ.2016, రూ. 4,0 16 చొప్పున ఇప్పటివరకు 18.45 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన 930 మంది రైతులకు ఇప్పటివరకు రూ. 6.21 కోట్ల రైతుబంధు నిధులొచ్చాయి. ఈ గ్రామంలో వివిధ కారణాల చేత మృతి చెందిన 17మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ. 85 లక్షల రైతు బీమా పరిహారం అందింది. ఈ గ్రామంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న 187 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.51.25 లక్షలు మంజూరు చేసి ఆదుకున్నాం. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా 132 మందికి రూ. 1.21 కోట్లు, షాదీ ముబారక్ ద్వారా 40 మందికి రూ.37.83 లక్షలు ఇచ్చి పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాం. మొత్తం రూ. 415.35 లక్షలు ఖర్చు చేసి 653 ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన మంచినీటిని సరఫరా చేస్తున్నాం. మిషన్ కాకతీయ మొదటి దశలో రూ.118. 50 లక్షలతో పెద్ద చెరువు అభివృద్ధి పనులు, మరో రూ.48.70 లక్షలతో పెద్ద చెరువు నిర్వహణ, మిషన్ కాకతీయ రెండవ దశలో రూ.30.85 లక్షలతో మాదిగ కుంట అభివృద్ధి పనులు, మిషన్ కాకతీయ మూడవ దశలో రూ.11.85 లక్షలతో ఎల్లమ్మ కుంట అభివృద్ధి పనులు చేపట్టాం. కుద్వాన్ పూర్ గ్రామంలోని 58 మహిళా గ్రూపులకు రూ.24.76 వడ్డీ లేని రుణం అందించాం. యాదవ సోదరులకు మొదటి దశలో రూ. 21.25 లక్షలతో 17 మందికి గొర్రెల యూనిట్లు మంజూరు చేసాం. ఉపాధి హామీ పథకం కింద రూ.67.44 లక్షలతో 562 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, రూ.1.45 లక్షలతో 35 సోక్ పిట్ల నిర్మాణం పూర్తి చేసాం. ఈ గ్రామంలో విద్యుత్ సరఫరా మెరుగుదలకు రూ.9.80 లక్షలతో నాలుగు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, లూజ్ వైర్లు సరి చేయడం, వంగిన స్తంభాలు మార్చడం, స్తంభాలకు థర్డ్ వైరు బిగించడం, పాడైపోయిన స్తంభాలను మార్చడం వంతు పనులు చేశాం. ఈ గ్రామంలోని 2325 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి 811 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశాం. ఈ గ్రామానికి చెందిన 175 మందికి కేసిఆర్ ఇట్లు పంపిణీ చేశాం. ఆర్మూర్ నుంచి నందిపేట్ వయా కుద్వాన్ పూర్ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.250 లక్షలు, కుద్వాన్ పూర్ నుంచి తొండకూరు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.239 లక్షలు , కుద్వాన్ పూర్ తొండకూరు మధ్యలో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.240 లక్షలు మంజూరు చేసాం ఈ గ్రామంలోని 12 మందికి రూ.61 లక్షలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసాం. దాదాపు 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాం. ఎల్లమ్మ వాడలో షెడ్డు నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేసాం. కుమ్మరి సంఘం భవన నిర్మాణానికి రూ.5 లక్షలు, శివాలయం దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం రూ.5 లక్షలు, మాదిగ సంఘం దగ్గర షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, గంగపుత్ర సంఘం భవనం ప్రహరీ గోడ నిర్మాణం కోసం రూ.5లక్షలు, మున్నూరు కాపు మంగల్ రాం పంథా దగ్గర షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎస్సీ మాల సంఘం దగ్గర షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, మైనార్టీ ఫంక్షన్ హాల్ దగ్గర షెడ్డు నిర్మాణానికి రూ.15 లక్షలు, కబర్ స్థాన్ ప్రహరీ గోడ మిగులు పనులకు రూ.5 లక్షలు, గౌడ సంఘం భవనం షెడ్డు నిర్మాణం కోసం రూ.5 లక్షలు, వడ్డెర సంఘానికి రూ.4 లక్షలు, ముదిరాజు సంఘానికి రూ.5 లక్షలు, నాయక పోడు కమ్యూనిటీ హాల్ షెడ్డు నిర్మాణానికి రూ.5 లక్షలు, యాదవ కమ్యూనిటీ హాల్ షెడ్డుకు రూ. 5లక్షలు, మున్నూరు కాపు కోల్కొండ వారి పంథా హాలు షెడ్డుకు రూ.5లక్షలు, మున్నూరు కాపు గుండు వారి పంథా హాల్ షెడ్ కు రూ. 5లక్షలు, పద్మశాలి కమ్యూనిటీ హాల్ కు రూ.5 లక్షలు, మున్నూరు కాపు ఉద్గిర్ పంథాకు రూ.5 లక్షలు, మహిళా సంఘం భవనానికి రూ. 5లక్షలు, గ్రామపంచాయతీ భవనానికి రూ.20 లక్షలు, రైతు వేదిక నిర్మాణానికి రూ.22 లక్షలు, ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ కొనుగోలుకు రూ. 9 లక్షలు, డంపింగ్ యార్డ్ నిర్మాణానికి రూ.2.50 లక్షలు, వైకుంఠధామం నిర్మాణానికి రోయి.10.30 లక్షలు, నర్సరీ నిర్మాణానికి రూ.2 లక్షలు, పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి రూ.7.15 లక్షలు, తెలంగాణ క్రీడా ప్రాంగణం నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరు చేసాం. కుద్వాన్ పూర్ గ్రామ పంచాయతీకి ఇప్పటివరకు రూ.4.71 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వచ్చాయని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గ్రామ ప్రగతి నివేదికను ప్రజలకు వివరించారు.
“మీకోసం జీతగాడిలా పనిచేస్తున్న నన్ను మూడో సారి కూడా గెలిపించండి” అని అని జీవన్ రెడ్డి అర్ధించారు.
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం
-కేసీఆర్ పాలనతోనే తెలంగాణ ప్రగతి
-ఆర్మూర్ లో అభివృద్ధి యాగం..సంక్షేమ యోగం
-రైతులు,చేతి వృత్తులకు బాసటగా ప్రభుత్వం
-ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ సంక్షేమ కాంతులు
-కూలిపోయిన కుల వృత్తులకు జవసత్వాలు
-ఆర్మూర్ లో 8వేల మంది యాదవ సోదరులకు గొర్రెల యూనిట్లు
-దళిత బంధు ద్వారా మాల, మాదిగ వర్గాలలో వెలుగులు
– అన్నికులాలకు సమున్నత గౌరవం ఇచ్చే చైతన్య వేదిక ఆర్మూరు
-నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని కులాల వారికి ఫంక్షన్ హాళ్లు
-3వేల ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున నిధులు
-కేసీఆర్ గారే హ్యాట్రిక్ సీఎం
-మళ్లీ గెలిచేది నేనే
-పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
-బీఆర్ ఎస్ లో పెద్ద ఎత్తున చేరిన మాల సంఘం నేతలు, సభ్యులు
ఆర్మూర్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్9:
బీఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సంక్షేమం సాధ్యం.
కేసీఆర్ పాలనతోనే తెలంగాణ ప్రగతి రథం ముందుకు పోతుంది. నేను ఆర్మూర్ లో అభివృద్ధి యాగం చేస్తున్న. అర్హులైన వారందరికీ సంక్షేమ యోగం పట్టిస్తున్నా అని
పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామానికి చెందిన మాల సంఘం సభ్యులు వందలాదిమంది ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం లో అధ్బుతమైన ప్రగతి సాధించేలా గొప్పగా పాలిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ ప్రగతిశీలక ఆలోచనా విధానం పట్ల తామంతా ఆకర్షితులమై ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే జీవనన్న నాయకత్వంలో పని చేయాలని బీఆర్ ఎస్ లో చేరినట్టు ఆ సంఘాల నాయకులు, సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత గౌరవం ఇస్తామన్నారు.
“ఆర్మూర్ అంటేనే రైతులు, చేతి వృత్తులకు ప్రసిద్ధి. సకల కులాలకు సమున్నత గౌరవం ఇచ్చే చైతన్య వేదిక ఆర్మూర్. ప్రజల సహకారంతో నియోజకవర్గం ప్రగతి బాటలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడిన రైతులను రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత విద్యుత్ సరఫరా, చెరువుల పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ముఖ్యంగా పోచంపాడును నీటికుండలా మార్చడం, గుత్ప ప్రాజెక్టును పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవడం, చెక్ డ్యామ్ లు నిర్మించడం వంటి కార్యక్రమాలతో వారు కుదుట పడేలా చేశాం. ఆర్మూర్ నియోజకవర్గం చేతి వృత్తులకు పెట్టింది పేరు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూలిపోయిన కుల వృత్తులకు మళ్లీ ప్రాణం పోసే కార్యాక్రమాలు అమలు జరుగుతున్నాయి. చెరువుల్లో చేపల పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టి మత్స్యకారుల జీబితాలకు వెలుగునిచ్చాం. రజక, నాయీ బ్రాహ్మణ వృత్తులకు ఉచితంగా విద్యుత్ సరఫరా జరుగుతోంది. బీసీ వర్గాలకు చెందిన కులవృత్తులకు ఒక లక్ష రూపాయల చొప్పున ఆర్థిక చేయూతనివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 3వేల ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షల చొప్పున నిధులు ఇవ్వబోతున్నాం.
ఇప్పటికే ఆర్మూర్ నియోజకవర్గంలో లో 8వేల మంది యాదవ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయి.
బీఆర్ఎస్ కు అన్నికులాలూ సమానమే. దళిత బంధు, బీసీ,మైనార్టీ, గిరిజన బంధు ఇస్తూ ఆ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం.అంతే కాకుండా
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని సామాజిక వర్గాల వారి కోసం ఫంక్షన్ హాళ్లునిర్మిస్తున్నాం.
ఆర్మూర్ నియోజకవర్గానికి అద్భుత అభివృద్ధి, సంక్షేమ పథకాలు సాధించి ప్రగతి పథంలో నడిపిస్తున్న.
ఈసారి కూడా కేసీఆర్ గారు కాకుండా ఎవరొచ్చినా తెలంగాణకు ముప్పే. ఎటు చూసినా కారు, సారు, కేసీఆరే. మళ్లీ మళ్లీ విజయం బీఆర్ ఎస్ దే. హ్యాట్రిక్ సీఎంగా చరిత్ర సృష్టించడం ఖాయం. మళ్లీ నేనే గెలుస్తా. జీవితమంతా మీకు తోడుగా నిలుస్తా” అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.