Telugu Updates

టీయుడబ్లుజే-ఐజేయు జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ అధ్వర్యంలో “సేవ్ జర్నలిజం.. సేవ్ మీడియా” కార్యక్రమంలో ర్యాలీతో గొంతెత్తిన జర్నలిస్టులు..

Post top

సేవ్సేవ్ జర్నలిజం .. సేవ్ మీడియా

* మీడియా రక్షణ చట్టం రావాలి
* మీడియా కమిషన్ కావాలి
* కేంద్ర, రాష్ట్రాలకు జర్నలిస్టుల డిమాండ్
* టియుడబ్ల్యూజే(ఐ జే యు) ర్యాలీ
* గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేత
* సమస్యల పరిష్కారించాలని కలెక్టరుకు వినతి
* టీయుడబ్లుజే జిల్లా అధ్యక్షులు సంజీవ్ అధ్వర్యంలో సేవ్ జర్నలిజం
* గొంతెత్తిన జర్నలిస్టులు..

నిజామాబాద్(తెలంగాణ ఫోకస్)అక్టోబర్ 2: దేశంలో జర్నలిజం రక్షణకు, జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని టీయుడబ్లుజే- ఐజేయు జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ కోరారు. వెంటనే మీడియా రక్షణ చట్టం, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే – ఐజేయు పిలుపు మేరకు సోమవారం సేవ్ జర్నలిజం కార్యక్రమం నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా “సేవ్ జర్నలిజం” కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీయుడబ్లుజే-ఐజేయు జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్ మాట్లాడుతూ.. దేశంలో జర్నలిస్టులపై జరుగుతున్న అక్రమ దాడులను ఆరికట్టాలని కోరారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు రైల్వే పాస్ లు పునరుద్దరించాలన్నారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని జిల్లా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డులు ఇచ్చి, క్యాష్ లెస్ చికిత్స ఇవ్వాలని అన్నారు. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో, జర్నలిస్టుల పిల్లలకు 100% సబ్సిడీ అందించాలన్నారు. హెల్త్ కార్డులు కార్పొరేట్ వైద్యశాలలో సక్రమంగా అమలు చేయాలన్నారు. యూనియన్ జిల్లా కార్యదర్శి అరవింద్ బాలాజీ, జాతీయ కార్యవర్గ సభ్యులు చింతల గంగాదాస్ , జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆహ్మద్ అలీఖాన్, సీనియర్ జర్నలిస్ట్ ప్రమోద్, ఈనాడు బ్యూరో వెంకట్, సాక్షి బ్యూరో భద్ర రెడ్డి, ఆంధ్రజ్యోతి బ్యూరో సంపత్ రావు, ఎబిఎన్ స్టాఫర్ శ్రీపతి, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి శేఖర్, రాజలింగం, ప్రైమ్ 9 స్టాఫార్ గంగారెడ్డి, మండే మోహన్, కార్యవర్గ ఆర్మూర్ నాగరాజు, సంజీవ్, అజీజ్, వెంకటేష్, కార్యక్రమంలో విలేకరులు, ఎడిటర్లు, డెస్క్ జర్నలిస్టులను పాల్గొన్నారు.

Post bottom

Leave A Reply

Your email address will not be published.